Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

121

కాళిదాస చరిత్ర

కుం ప టి

ఉత్తరదేశమున

శీతాకాలమునం జలి

మిక్కుటముగా నుండును. భోజు డొకనాడు కుంపటి దగ్గఱ పెట్టుకొఇ చలి బోగొట్టుకొనుచుండెను. అది యినుప కుంపటి, దానికి రెండు చక్రములుగూడ నుండెను. అప్పుడు కాలిదాసు మహారాజును జూడ వచ్చెను. రాజు కవికులగురువైన కాలిదాసును జూచి యాకుంపటిని వర్ణింపుమని కోరెనుజ్. రాజు కొరిన ప్రకారము కాలిదాసుడిట్లు వర్ణీంచెను.

శ్లో॥కవిమతి రిన బహులోహా సంఘటితచక్రా ప్రభాతవే
     ళేవ,
     హరమూర్తి రిన హసంతి ఆతి విభూమానలోపేతా
     

ఈ శ్లొకమునకు రెండర్దములు గలవు.

తా॥ కవియొక్క మనస్సువలెమిక్కిలి యూహలు కలది (మంచియినుముతో జేయబడినది) ప్రభాతవేళ వలెగూర్చంబడిన చక్రవాకపక్షులు గలది,(రెండు చక్రములు కలది) శివునిమూర్తివలె చంద్రుడు,పార్వతి నిప్పును గలది (పొగలేని నిప్పుగలది) యై కుంపటి ప్రకాశించుచున్నది.

అ ల్లా ళ రా జు

ఒకనాడు భోజరాజుడు

కొలువుదీర్చి యుండ

ద్వారపాలకుండువచ్చి "దేవా! శ్రీశైలమునుండి యొక బ్రహ్మచారి వచ్చె" ననిమనవిచేసెను. వెంటనే వానిని బ్రవేశపట్టుమని రాజానితిచ్చెను. అతడు ప్రవేశించి "చిరంజీవి" యని భోజునిదీవించి కూర్చుండ నతడు వానికిట్లనియ- "మహాత్మా రాజ్యమునందే కలికాలవిరుద్దమైన యీదుష్కరవ్రత మేల పూనితివి? ప్రతిదినోపవాసములచేత నీవు కృశించుచుంటివి. నీవు గృహస్ధాశ్రమమున్ స్వీకరింపదలచితివేని యా పట్టణమందలి బ్రాహ్మణులలో నెవరినైన నొడంబఱచి పిల్లనిప్పించి