పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16]

117

కాళిదాస చరిత్ర

  ఆశ్లోకార్దము గ్రహించి భోజభూపాలుడు డజ్త్మగతమున నిట్లు వితర్కించెను. “సముద్రములో వ్రాతయున్న శిలాఫలకము దొరకుటకు గారణమేమి? ఇందునకొక హేతువు వుండవచ్చును. పూర్వము భగవానుడగు నాంజనేయుడు వాల్మీకిరామస్యణము సరిగానుండలేదని తానొక రామాయణమురచియించి దానిని ఱాతిఫలకముమీదవ్రాసి శ్రీరామునకు వినిపించెను. రఘురాముడు దాని నామూలాగ్రముగ విని, చిఱునవ్వు నవ్వి ‘హనుమంతుడా! నీపుస్తకములో నీప్రజ్నలెక్కువ చెప్పుకొన్నావే ‘ యని పలికెననియు, రాముడు మెచ్చని గ్రంధ ముండకూడదని, హనుమంతుడు దానిని మహాసముద్రములో బాఱవైచె ననియు బెద్దలు చెప్లుదురు. హనుమద్రామాయణమందలి యొకపలక యిదియైయుండవచ్చును. ఈపలకమీద గనబడుచున్న రెండుపంక్తులు హనుమద్రామాయణములోని యొకశ్లోకముయొక్క పూర్వార్దమై యుండవచును. తక్కిన రెండుపాదములు సరిగా బూరించిన జాలినిగదా“ అని తలపోసి సభామండపమునకుబోయి శ్లోక పూరవార్దమిచ్చి యుత్తరార్ధము పూరొంపుమని భవభూతికిచ్చెను. భవభూతి యిట్లు చెప్పెను.

    క్వనుకుల మకలంక మాయతాక్ష్యా:
    క్వచ రజనీచరసంగమాపవాద:

తా॥సీతాదేవియొక్క నిష్కళంకమైన వంశమెక్కడ? రావణ సంగమమయ్యెనను నపవాదమెక్కడ?

  భవభూతివిరచితమైనశ్లోకముయొక్కభావము భోజరాజునకు నచ్చకపోవుటయే దానుగూడ మహాకవీశ్వరుడగుటచే నీక్రిందివిధముగా శ్లోకార్దము రచియించెను.

     క్వజనకతనయా క్వ రామజాయా
     క్వ చ దశకంధరమందిరే నివాస।