కాళిదాస చరిత్ర
అప్పుడు దండి యీ క్రిందిపాదము జేర్చెను.
'చలతి శిశింవాతే మందమందం ప్రభాతే '
అప్పుడు కాళిదాసిట్లు పూరించెను
'యువతిబనకదంబే నాధముక్తోష్ఠబింబే,
చరమగిరినితండే చంద్రబింబం లలంబే '
తా॥ పడమటికొండ కటి ప్రదేశమును ఇంద్రుడు వ్రేలాడుచుండెను. ప్రభాతమునందు మెల్లమెల్లగా చల్లగాలి వీచుచుండెను. (దండి పూరించినది) పడుచు పడతుల యధరోష్ఠములను భర్తలు విడుచుచుండగా, (కాళిదాసుడు పూరించినది)
కాళిదాసుని వర్ణనము దండి వర్ణనముకన్న మిన్నగ నున్నకతమున రాజు దాసునకే యెక్కువ బహుమానమిచ్చెను.
ఱా తి ప ల క
నర్మదానదిలో
బెస్తవాండ్రు
చేపలుపట్టుచుండఘా వారికొక ఱాతిపలక దొరకెను. దానిమీద నేదో వ్రాతయుండెను. అందు గొన్ని యక్షరములు చెరిగిపోయి కనబడకుండెను. కొన్ని మాత్రమే కనబడుచుండెను. అది వ్రాతయున్న శిలా ఫలకమగుటచేత జాలరులు గొనిపోయి భోజునకు సమర్పించిరి. భోజుడా ఫలకమును జక్కగా బరీక్షించి దానిమీద లక్కముద్రలు వేయింపంగా నొకశ్లోకములో సగముభాగము దొరకెను. అందీవిధముగా నుండెను.
శ్లో॥ అయి ఖలు విషమ: పురాకృతానాం
భవతిహి జంతుషు కర్మణాం విపాక:
తా॥జంతువులయందు పురాకృతములైన కర్మల యొక్క విపాకము విషమమై యుండునుగదా.