పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


113

కాళిదాస చరిత్ర

మిక్కిలి బాధపడుచున్నాడు. ఆరోగ మెవ్వరికి సాధ్యమైందికాదు. అంచుచేత భోజుదు తనదేశమునుండి వైద్యులనందఱిని వెడలుగొట్టించెను. వైద్యశాస్త్రము వట్టి బూటకమని నిరసింపబడెను. వైద్య గ్రంధములు నీటిలోబాఱవేయబడెను.

     అదివిని మహేంద్రుడు విస్మయమంది తనచెంత నున్న యశ్వినీ దేవతలనుజూచి యట్లుపలికెను. "'ఓహో! స్వర్ణవైధ్యులరా, ధన్వంతరీయమైన వైద్యశాస్త్రము బూటకమా!" అనవుడు దేవవైద్యులు, "మహేంద్రా! వైద్యశాస్త్ర మబద్దముకాదు. మనుష్యులకు సాధ్యముకానట్టియు, దేవతలచేతనే సాద్యమగునట్టియు దారుణరోగముచేత భోజభూపాలుడు బాధపడుతున్నా" డని బదులు చెప్పిరి. "ఆరోగమేనా? అది మీకు సాధ్యమగునా?" యని యింద్రుడు మరలనడుగ, వారి ఆ! మే మెఱుగుదుము. కపాలశోధనకాలమున జేపలు శిరస్సునదూరినవి. దానివలన శిరోవేదన కలిగినది" యని యుత్తరముచెప్పిరి. అప్పుడింద్రుడు చిఱునవ్వుచేత మొగము వికసింప "అట్లైన మీరిప్పుడే భూలోకమునకరుగుదు మీరరిగి యారొగము నివారింపకపోదురేని భూలోకమునందు వైద్యశాస్త్రముమీది విశ్వాసముపోవును. అతడు సరస్వత కాధారమైనవాడు.అనేకశాస్త్రముల నుద్దరించినవాడు. కావున, నవశ్యమురక్షణీయుడు" అని హెచ్చరించెను. దేవేంద్రునానతి శిరసావహించి యావైధ్యులిరువురు భూలోకమునకరిగి బ్రాహ్మణ వేషములు దాల్చి భోజుని మందిరద్వారమున నిలిచి ద్వారపాలకునితో నిట్లనిరి.  "ఓయీ ! మేము వైధ్యులము బ్రాహ్మణులము. కాశీపురమునుండి వచ్చితిమి ఆరాజేంద్రుడు వైద్యశాస్త్ర మబద్దమని నిరసించినాడని విని వైద్యశాస్త్రము సత్యమని స్దాపించుటకును, నృపాలుని రోగముకుదుర్చుటకును  మేమువచ్చితిమి. మారాక ఱేనికెఱింగింఫుము" అనవుడు ద్వారపాలకుడు "బ్రాహ్మణులారా! వైధ్యుడన్న వాని నెవ్వరిని లోపలికి రానీయగూడదని రాజాజ్ఞయైనది. రాజుగారు మిక్కిలిజబ్బుగా