పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
114

కాళిదాస చరిత్ర

మన్నారు. మీరాక విజ్ఞాపనము చేయుటకు దగిన సమయముకాదు" అని వారిని నిరోధింప నా సమయముననే బుద్ధిసాగరు డేపనిమీదనో ద్వారము కడకువచ్చి వారివలన వారిరాకకు నిమిత్తమెఱిగి వారిని రాజసన్నిధికిం గొనిపోయెను. మహారాజు వారి దివ్య సుందరవిగ్రహములు జూచి వారివలన దనరోగము నివారితమగునని నిశ్చయించు వారిని గౌరవించెను. అప్పుడు వరు రాజుంజూచి "మహీపాలా! భయపడకుము. నీరోగము కుదిరినదినమ్ముము. కాని, యీస్దలమందు నీవును మేమును దప్ప మఱియెవ్వరు నుండకూడదు" అనిపలుక రాజు వల్లెయని యట్లు చేసెను. అశ్వినీదేవతలు భూపాలునకు మోహచూర్నమిచ్చి మత్తుగల్గించి శస్త్రముచే గపాలముభేదించి లోపలనున్న చేపపిల్లలం దీసి యొక పాత్రయందుంచి , సందానకరణిచేత వెండియు గపాలమును యధాప్రకారమమర్చి సంజీవ కరణిచేత నతనిని మరల బ్రతికించి చేపపిల్లల వానికి జూపిరి. రాజు వాటినిజూచి విస్మేరమనస్కుడై యిది యేమి కారణమని యడుగ దేవచికిత్సకులు "రాజా! నీకపాలశోధనకాలమున నిది సంప్రాప్తమైనది" యని వారు త్తరముచెప్పిరి. అప్పుడు రాజువారు దివ్యపురుషులని తెలిసికొని "తన కేమిపధ్య" మని యడిగెను. అప్పుడు వారిట్లనిరి.

     శ్లో॥అశీతే నాంభసా స్నానం, పయ:పానం,
         నయన్ స్త్రీయు,ఏత ద్వోమాంషా: పధ్యం... ...
          

తా॥ ఓమనుష్యులారా! వేడినీళ్ళస్నానము, పాలుత్రాగుట, పడచుపడంతుల సహవాసము నివి మీకు పధ్యములు.

     ఓ మనుష్యులారా యనుటచేత వారు శ్లోకము పూరిచేయకమునుపె రాజు వారిచేతులు పట్టుకొని మీరెవ్వరని యడిగెను. వారాచేతులు వదిలించుకొని శ్లోకముయొక్క నాలుగవపాదము మీ కాళిదాసు పూరింపగలడని పలికి యంతర్దానమైరి.