పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
112

కాళిదాస చరిత్ర

గాఢమైన తలనొప్పి బయలుదేరెను. వైద్యులువచ్చి యెంత చికిత్స చేసినను శిరోవేదన శాంతింపలేదు. మనుష్యవైద్యుల కెవ్వరికేని బూధపడలేదని దారుణరోగముచేత నతడహూరాత్రములు విశ్రాంతిలేక భాధపడుచుండుటచే శరీరము చిక్కిపోయెను. సుఖము గతించెని. చలికాలమందలి తామరపువ్వువలె మొగము మాడిపోయి కళావిహీఅమయ్యెను. రాజ్యవ్యాపారములయందు విముఖుడయ్యెను. ఎండినపుల్లల మీద నగ్నిహోత్రుడువలె వ్యాధివిజౄంబించెను. అన్నమురుచింపక పోయెను. నిగ్రపట్టలేదు. ఇట్లు సంవత్సరకాలముగడచెను. అరోగమెవ్వరును నివారింపలేకపోయిరి. అనేకౌషధముల మ్రింగి మ్రింగి రోగనివారణమునుగానక ప్రాణమువిసిగి యా క్షితిపాలుడు, తనయవస్దం జూచి దు:ఖసాగర నిమగ్నుడైన బుద్దుసాగరునిగనుంగొని నీరసముచేత మాటాడలేక నెంతో కష్టముమీద నిట్లనియె.

   “ఓయీ! బుధిసాగరా, వైద్యులెవ్వరు నారోగము గుదుర్పలేక పోతిరి. కావున నేడు మొదలుకిని నాదేశములో వైద్యులెవ్వరు గాపురముండగూడదు. బాహాటము మొదలగు వైద్యగ్రంధములను దీసికొనిపోయి నీటిలో బాఱవైచిరండు. నస్కుదేవతలను గలసికొను కాలము సమీపించినది. నానిమిత్తమై మీరెవ్వరు విచారింపవలదు.”
  భోజు డీవిధంబుననుండ నొకనాడు స్వర్గలోకమున మహేంద్రు డష్ట దిక్పాలకులతోడను, దేవసమూహముతోడను, బ్రహ్మర్షి రాజర్షి గణముతీడను, నిండుకొలువుండి నస్రదమునినింజూచి “మునీంద్రా! భూలోకమున వార్తలెవ్వి?” యనియడిగెను. అనవుడు నారదమహాముని యిట్లనియె, “మహేంద్ర!భూలోకమున మహాశ్చర్యమేమియునులేదు. ధారానగర పరిపాలకుడైన భోజమహారాజు జబ్బుగా నున్నాడు.