పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

111

కాళిదాస చరిత్ర

ఇట్లు విపరీతముగా వేదమంత్రభాగములతో నొకశ్లోకమున సగముభాగమల్లి పిమ్మట నోరాడక వా రూరకుండిరి. వారిం గరుణించి భోజరాజు కొంతబహుమానము వారికిచ్చిపంపి మఱునాడు కొలువుకూటమున కరిగి యాస్దానవిద్వాంసులంగాంచి యారెండుపాదములనిచ్చి శృంగార రసప్రధానముగా శ్లోకముపూరింపుమని వారినడిగెను. తక్కినకవులందఱు దానిం బూరింపలేక యూరకుండ గాళిదాసు కడు చమత్కారముగా దాని నిట్లు పూరించెను—

   శ్లో॥అణోరణీయా న్మహతో మహీయన్
      మధ్యోనితంబశ్చ యదంగ నయా:
      తరంగహారి దనిమజ్జనేన
      యజ్ఞపనీతం పరమం పవిత్రం

తా॥ఏ పడతియొక్కనడుము పరమాణువుకంటె జిన్నదియై, కటిప్రదేశము మహాపదార్దముకంటె గొప్పదియై యుండునో, యాయంగన యొక్క మేని పసపుతో దడసిన జందెము మిక్కిలి పవిత్రమైనది.

   ఆశ్లోకమందలి భావసౌకుమార్యమునకు మహారాజు భళీ యని మెచ్చి కాళిదాసునకు దగిన పారితోషిక మొసంగెను.

అశ్వనీదేవతల వైద్యము

భోజరాజు నగరము వెలుపల్స నొక

క్రొత్తచెఱువుత్రవించెను. చిన్ననాట

నుండియునాతడు తనకలహమునుశోధించుకొనుట నలవాటు చేసికొనెను. ఆ నూతనతటాకమున స్నానము చేయునప్పుడు మునుపటి యలవాటుచొప్పున నిజకపాలమును దీసి శోధనచేసికొనెను. ఆసమయమున రెండుంచేపపిల్లలాకపాలములో దూరెను. అదియెఱుగక భోజుడు కపాలము నెప్పటియట్ల నమర్చుకొనెను. అది మొదలుకొని యతనికి