పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
110

కాళిదాస చరిత్ర

రాజుయొక్కతారుణ్యలావణ్యములుగాంచి మోహించి పరవశత్వముచేత దనచేతనున్న పాత్ర మేడమీద జాఱవైచెను. అదిమేడమెట్లనిండి టంటంటంటంటం అని దొర్లుచు నేలబడియెను. భోజనానంతరమున మహారాజు సభామమంటమలకరించి ‘ టంటంటంటంటంటంటంటంటం ‘ అను సమస్యను బూరింపుమని కవులనడిగెను. తక్కినవారందఱు దానుభావ మెఱుగక మూగలట్లు మొగమొగంబులు చూచుకొనుచు నూరకుండిరి. కాళికాదేవి వరప్రసాదమున సకలరహస్యములు దెలిసికొమగల కాళిదాసుడు అమస్య నిట్లు పూరించెను.

శ్లో॥రాజాభిషే కే మదవిహ్వలాయా।
   హస్తాచ్చ్యుతో హేమఘటో యువత్యా
   సోపానమార్గేషు కరోతి శబ్దం
  ’ టంటంటంటంటంటంటంటంటం’

    తా॥రజ్జుగారి స్నానసమయమందు మోహపరవశయైన పరిచారిక యొక్క చేతినుండి బంగారుపాత్ర జాఱి పడిపోగా మెట్లమీదనిండి టంటంటంటంటంటంటంటంటం’ అనిశబ్దముచేయుచుగ్రిందబడెను.

యజ్నోపవీతం పరమం పవిత్రం

వేదాధ్యయనప్రవీణులైనచాందస

బ్రాహ్మణు లిరువురు భోజభూపాలుని

మెప్పించి సంభావన గైకొనదలంచి ధారాపురికి బోయి కవిత్వము చెప్పింనంగాని భోజుడు బహుమాంస్మియ్యడని పురజనులవలన నెఱొంగి యెట్టెటో రజ్జదర్శనముచేసి యందొక ఉపనుషత్తులో నున్న “అణోరణీయా న్మహతో మహీయాన్ “ అనునదొక పాదముగా చెప్పి శ్లోకమారంబించి నృపాలునియెదుట జదివెను. రెండవవాడు జందెము వేసికొనునప్పుడు చదువుమంత్రములో మొదటిపాదమైన మంత్రమును రెండవపాదముగా జేసి “యజ్నోపవీతం పరమం పవుత్రం” అనువదివెను