ఈ పుటను అచ్చుదిద్దలేదు
15]
109
కాళిదాస చరిత్ర
బిరబేబింబే కోకిలారాం వికావో
రావెరావే జాయతే పంచబాణ।
తా॥పతిగృహమందును కరలుచున్నబంగారుతీగలు గలవు ప్రతితీగయందును పున్నమనాటి చంద్రమండల మున్నది. ప్రతి చంద్రబింబమునందును కోకిలస్చర మున్నది. ప్రతి స్వరమునందును మన్మధుడు మొల కెత్తుచున్నాడు.
ఈ శ్లోకము నతడు చదువుకొనుచు విదర్భాపుర వీధులయందు సంచరించుచుండగా నొకపడుచుపిల్ల "రావేరావేజాయతేపంచబాణ" అను కడపటి పాదము మాత్రమును మాత్రము విని యతడు తన్ను రావేరావే యని పిలుచుచున్నాడనుకొని యతని దుండగమునకు మిక్కిలి కోపించి తండ్రితో జెప్పెను. తండ్రి భోజరాజుకడకుబోయి "మహరాజా! చూచితిరా మీ యాస్ధానకవీశ్వరుని సాహసము నాకూతును జూచి రావేరావే యని పిలిచినాడట" యని మొఱపెట్టెను.
రాజు కవిరాజునుబిలిచి యడుగ నతడ్ మందహాసముచేసి యిట్లనియె-- "దేవా! నేను విదర్భాపుర వర్ణనముచేసితిని . అందు కడపటిపాదమున "రావేరావే" యనియున్నది. అది యాంధ్రభాషలో నపార్దమిచ్చునుగాబోలు! సంస్కృత భాషలో మంచియర్దమిచ్చుచున్నది. ఆ శ్లోకమున్ నేను చదువుకొనుచు వెళ్ళితినిగాని యా బాలిక నవమానింపలేదు" అని యాశ్లోకమును జదివెను. అది రాజువిని చిఱునవ్వు నవ్వి యా బాలికతండ్రిని సమాధానపఱచి పంపెను.
టం టం టటం టం
భోజభూపాలుడు మిక్కిలి
చక్కనివాడు. నవమన్మ
ధాకారుండగు నతడొకనాడు స్నానము జేయుచుండగా నొక పరిచారిక