పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
100

కాళిదాస చరిత్ర

భావము పాపమప్పటికి రెండుజాములైనదిగనుక కడుపులో ప్రేగులు మాడిపోవినట్లు కరకర యాకలియైనదికాబోలు ! అందుచేత కప్పునేయితో గలిపిన యన్నము జ్ఞాపకమువచ్చి యాపాదములు జెప్పియుండవచ్చు కవిత్వముగా మంచికల్పనలు, భావములు, రసములు, మేలైన యుపమానము లుండవలెనని వారి జన్మమధ్యమందెరుగరు. ఏవో నాలిగు పదములు గూర్చినపక్షమున గవియైపోవునని వారు తలంచియుందురు.

    వారాచిధముగా నవస్దపడుచుండ నంతలో దేవీ పాదప్రణామము జేయుటకై కాళిదాసుడు ‘మీరేమివ్రాయుచున్నా ‘ రని యడుగ వారిట్లనిరి. “అయ్యా ! మేము బ్రాహ్మణులమ, చాందసులము, నిరిపేదలము, కుటుంభ్రణము చేయలేక మిక్కిలి కందుచున్నాము. భోజు నాశ్రయించి దారిద్ర్యము బోగొట్టుకొవలెనని వచ్చినాము. కాని, కవితారసోల్లాసుడైన యారాజు మాబోటి చాందసులకు సంభావనలియ్యడని వింటిమి. అందుచే నెట్లైన నొకశ్లోకమల్లి భోజదర్శనము చేయవలెనని ప్రయత్నించుచున్నాము. ప్రొద్దుటినుండి చచ్చిచెడి రెండుపాదము లల్లితిమి. తక్కినపాదములల్లుటకు మాతరము, మాతాతతరము గాకున్నది”అని యారెండుపాదములు జదివి  వినిపించిరి. కాళిదాసుడు చిఱునవ్వునవ్వి తక్కిన రెండుపాదములు నేను చెప్పెద వ్రాసుకొనుడనిపలికి యిట్లుచెప్పెను.

“మహిషంచ శరచ్చంద్ర చంద్రికాధవళింధధి“

రా॥శరత్కాలచంద్రుని వెన్నెలవలె, తెల్లని గేదెపెరుగుగూడ నిమ్ము.

   శ్లోకము చక్కగా గుదిరినదని చాందసులు సంతసించి రాజు దర్శనముచేయ సభామంటపద్వారముకడకు బోయి ద్వారపాలకునిగని