ఈ పుటను అచ్చుదిద్దలేదు
14]
101
కాళిదాస చరిత్ర
“ఓయీ! మేము కవిత్వముజెప్పితిమి. మేమువచ్చినట్లు రాజుగారితో మనవిచేయుము“అనిచెప్పిరి. దౌవారికుడు రాజుంగని నమస్కరించి యీక్రిందిశ్లోకములో బ్రాహ్మణులరాక నెరింగించెను.
శ్లో॥రాజమాషనిభైర్దంతై: కటివిన్యస్తపాణయ:
ద్వారి తిష్టంతి రానేంద్ర! చాందసా: శ్లోకశత్రవ:
తా॥బొబ్బర్లవంటి దంతములుకలిగి, నడ్డినిచేతులుపెట్టుకొని కవిత్వమునకు శత్రువులైన యిద్దఱు చాందస బ్రాహ్మణులు ద్వారమందున్నారు మహాప్రభో.
అదివిని రాజు వారిం బ్రవేశపెట్టమని యాంతిచ్చెను. వారు ప్రవేశించి శ్లోకమిట్లు చదివిరి.
శ్లో॥భోజనం దేహి రాజేంద్ర మృతసూపనమనిత్వం ఱలేదు
మాహించ శరచ్చంద్రికా ధవళం దధి
ఆశ్లోకమువిని మహారాజిట్లనియె— “ఇందలి మొదటి రెండుపాదములు మీరుచేసినవి. వాటికి బహుమాన మీయక్కరలేదు. కడపటి రెండుపాదములు మీవి కావు గాని, రసవంతముగా నుండుటచే నక్షరలక్ష లిచ్చుచున్నాను“ అని సబహుమానముగా వారినంపి కాళిదాసునిజూచి “యీశ్లోకమున గడపటి రెండుపాదములు నీవు రచియింపలేదా”యని యడిగెను. కాళిదాసుడు మందహాసముచేసి యూరకుండెను.
కొఱవుల కానుక
కడుదరిద్రమైనయొక
బ్రాహ్మణుడు కుటుంబ
భరణము చేసికొనలేక మిక్కిలి ఖేదపడి పుంభావనసరస్వతియైన కాళిదాసు