పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

హిందూకోడ్ బిల్ సమీక్ష

అనగా ఓయీ ఇంద్రా ! ఒక రాజు అనేక స్త్రీల తోడ శోభించునట్లు నీవు అనేక దీప్తులతోడ నలరారు చుంటివి. ఈ మంత్రమందోక పురుషున కనేకభార్యలు వర్ణింపబడిరి.

"పతిర్జనీనామ్
            (ఋ. 1.66-8)

ఇందుగూడ ననేక స్త్రీల కొకభర్త బోధించబడినాడు.

"క్షీరేణ స్నాతః కుయవస్య యోషే హతే తే స్యాతామ్"
                               (ఋ. 1_104–3)
"మర్య ఇవ యువతిభి స్సమర్షతి”
                               (ఋ. 9-86-16)
"ఏవే ద్యూనే యువతయో సమస్త"
                               (ఋ. 10-30-6)
"పరిష్వజన్తే జనయో యథా పతిమ్"
                                (ఋ.10-43-1)
"ఇంద్రం జుషాణా జనయో నమన్తీ"
                                [కా.సం.36-6]
"మనోర్వైదశ శాయా ఆసన్"
                                [మై.సం.1-5-6]

ఇత్యాది అనేక మంత్రముల వలన నొక్క పురుషునకు పలువురు భార్య లుండవచ్చునని బాగుగ దేటతెల్ల మగుచున్నది. కౌటిల్యులు కూడ వ్రాయుచున్నారు---

"పుత్రార్థీ ద్వితీయాం భార్యాం విన్దేత"

అనగా పుత్ర నిమిత్తముగా రెండవ భార్యను గ్రహించవచ్చును-

వధూవరులం దెవఱును మహామూర్ఖులుగాని, పిచ్చి వారుగాని కాకూడదు. ఇది మిగిలియున్న షరతు. వాస్తవ మందు వివాహ సమయమున నా విషయములం దెక్కువ