పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వడజాలవు. ఇట్లే ఒక పురుషున కిరువురు భార్య లుండ వచ్చును. కాని ఒక స్త్రీకి ఇరువురు భర్తలు ఉండజాలరు.

"యదేకస్మిన్ యూపే ద్వే రశనే పరివ్యయతి తస్మా దేకో ద్వే
జాయే విందతే, యన్నైకా ద్వయో ర్యూపయోః పరివ్యయతి తస్మాన్న
ద్వౌ పతీ విన్దతే "
                                   (తై. సం. 6.5.1.4)

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యునకు కాత్యాయని, మైత్రేయి యను నిరువురు భార్యలు కలరని వర్ణించబడినది. సపత్నీత్వము కడు దుఃఖదాయకమని చెప్పు మహా శయుడు కూడ వేదప్రతిపాదితమైన సపత్నీ విధానము నంగీకరింపక దప్పదు. నిషేధాత్మక వచన మేదేని దొరకనంతవరకు నావశ్యకములగు వివాహాంతరముల కభ్యంతర ముండదు.

"కల్యాణీభి ర్యుపతిథి ర్నమర్యః
                     (ఋ.10-30.5)
"జనీరివ పతిరేక స్సమానః ని మామృజే వుర ఇంద్ర స్సు సర్వాః".
                     (ఋ. 7-26-3)

అనగా ఇంద్రుడు కేవల మొంటరియై శత్రుపురముల నన్నిటిని ఒక్క భర్త యనేక భార్యలను శోధన జేసినట్లుగా శుద్ధిచేసెను. ఈ మంత్రమును బట్టి యొక పురుషునకు బలువురు భార్యలుండుట చెప్పబడినది. 'అనేక మంగళప్రదురాండ్రగు యువతులతోడ గూడిన పురుషుడు' అని ప్రథమ మంత్రమందు వర్ణించబడినది. ఒక్క భర్త అనేక భార్యలతో సమానుడని రెండవ మంత్రమువలన బ్రకటమగుచున్నది.

"రాజేవ హి జవిభిః క్షేప్యేవాబ ద్యుభిః".
                      (ఋ 7-18-2)