పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

హిందూకోడ్ బిల్ సమీక్ష

శ్రీ ధర్మదేవు లిట్లు వ్రాయుచున్నారు:

"జాయాపతే మధువతీం వాచం వదతు శంతివామ్
                         (ఆధర్వ. 4-30 - 2)
                         
“ఇహేమా వింద్ర సనంద చక్రవాకేవ దంపతీ"
                         (అధర్వసం. 14.4.84)
                         
ఇత్యాది వేడమంత్రములందు ఒక్క వివాహమే యాదర్శ
మైనదని స్పష్టముగ సమర్థించ బడినది.

"సంపాతపంత్యభిత స్పపత్నీరిప సర్షవః"
                         ( ఋగ్వేద. 1-104-8)

ఇత్యాది మంత్రములందు సపత్నీత్వము అత్యంత దుఃఖదాయకమని స్పష్టీకరించబడినది. కాని యిక్కడ చక్ర వారముల యుపమాసము భార్యాభర్తల దాంపత్యమును సమర్థించుచున్నది. విడాకుల చట్టమున కిష్టపడు వారికిది యంతయు నెందులకు నచ్చును? చక్రవాక మిధునము వియోగ కారణముచే రాత్రి యంతయు నాక్రోశించుచునే యుండును. తెల్లవాఱగనే మఱల గలసికొని యానందించును. భర్త మృతిబొందినప్పటి విషయ మెటులున్నను జీవించియుండగనే విడాకులిచ్చి పునర్వివాహము చేసుకొనవచ్చు నన్నచో నిక దంపతులయెడ నాచక్రవాక దృష్టాంతమెట్లు చరితార్ధమగును? వస్తుతః పైజెప్పిన మంత్రమందు దంపతుల పరస్పర ప్రేమ, స్నేహము వర్ణించబడినది. వేఱుగ సవసరములగు సంతానాదుల నిమిత్తముగా వేదవిహితమైన వివాహాంతరములు నిషేధింపబడ లేదు, ఒక్క యూపమునకు రెండు త్రాళ్లను గట్టవచ్చును. కాని ఒక్క త్రాటికి రెండు యూపములు కట్టు