పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

87

బిల్లు ఆచరణలోనికి వచ్చిననాటి నుండియు ప్రాచీన నియమములు, నాచార వ్యవహారములు లన్నియు రద్దు చేయబడగలవు' అని కోడులో స్పష్టముగ వ్రాసి యుంచ బడినది. హిందూకోడుద్వారా ప్రాచీన శాస్త్రము లన్నియు మంట గలుపబడు చున్నవని దీనిని బట్టియే స్ఫుటమగు చున్నది. శాస్త్ర, ధర్మ విశ్వాస మడుగంటుట తోడనే అన్న చెల్లెండ్ర వివాహ సమస్య సంభవించును. దానికి గూడ కొంత వ్యవస్థ చేయవలసియే వచ్చును. ప్రాచీన శాస్త్ర నియమములను, ఋషి గణము యొక్క యాదేశములను తిరస్కరించుట కభ్యాసపడిన వ్యక్తులు వర్తమాన శాసకుల శాసనముల నుల్లంఘించుట కెంతమాత్రము సంకోచింపరు.

ఇదియు గాక వైదిక వివాహము తర్మ సమ్మతమైన విషయము. చాల దూరపు వ్యక్తుల రక్తసంబంధము, చాల దగ్గఱ వ్యక్తుల రక్త సంబంధము నిర్వీర్యమయి పోవునను విషయము స్పష్టము. ఈ స్థితిలో ధార్మిక విధానము తర్క విరుద్ధమని భావించుటెట్లు? ఇట్లే శాస్త్రాచార్యుల యువదేశము లచే సంస్కరింపబడిన యంతఃకరణమం దుదయించు ప్రేర ణయు శాస్త్రానుకూలమే యగును. ఇక శాస్త్రీయ వివాహ మంతఃకరణ ప్రేరణకు విరుద్ధముగా నెటులుండును? ప్రేరణ యొటులున్నను బాధ లేదందురా? ఏ స్వేచ్ఛాచారి యంతఃకరణమందైన కూతురును చెల్లెలును పెండ్లాడవలెనని ప్రేరణ బయల్వెడల వచ్చును. కసాయివాడు గోహత్యకు బాల్పడుట కూడ వాని యంతఃకరణ ప్రేరణయే.