పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

హిందూకోడ్ బిల్ సమీక్ష


పద్ధతి, పతనోన్ముఖ ప్రవృత్తులు స్వాభావికములని యందఱు నెరిగిన విషయమే. శాస్త్ర ధర్మ విశ్వాసమున్ననాడు మనుజుడు పతనమునకు దూరీభూతుడగును. రాజ్యమందు దురాచార, సదాచారములను, సత్య, అనృతములకు - రెంటికిని స్వతంత్రత నిచ్చిన స్థితిలో సదాచారమందు, సత్యవిషయమునను బ్రవర్తించు జనులెంద ఱుందురు ? శాస్త్రోక్తములగు వర్ణాశ్రమ ధర్మములను బాటింపను వచ్చును, ఉల్లంఘించను వచ్చునన్న స్థితిలో కఠిన నియమములను బాటించుట కెవ్వరుద్యుక్తులగుదురు. ? మద్యము త్రాగను వచ్చును. త్రాగకుండను ఉండవచ్చును. వ్యభిచారము చేయనువచ్చును. చేయకుండను ఉండవచ్చును. ఎట్లు చేసిను సమానమే ' యని రాజ్య, సమాజములందు సంపూర్ణ స్వాతంత్య్ర మిచ్చి వేసినచో, శాస్త్రీయ నియములు పాటింపబడునను నాశయే వ్యర్థము. కావుననే శాస్త్ర విరుద్ధ కార్యములను జేయ నవకాశ మిచ్చుట ఆత్మహత్య జేసికొన నవకాశమిచ్చుటతో సమానమని విద్వాంసుల మతము. రెండువిధముల కార్యము లను సమానముగ భావించుటనునది సతీమతల్లిని, వేశ్యను సమానముగభావించుటయే. ఇది చాలయనుచిత విషయము. కనుక శాస్త్ర ధర్మముల విశ్వాసము లేని వారికి 'సివిలు మేరేజి 'యే బాగున్నది. హిందూకోడును నిర్మించి శాస్త్ర విశ్వాసులను, అవిశ్వాసులను సమానముగ జూచి ధర్మ విశ్వాసమును, శాస్త్రవిశ్వానమును శిధిల పరచుట ఏమియు బాగులేదు.