పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

91

దృష్టి నుంచవలసినదే. కానీ మూర్ఖత్వాదికమును నిర్ణయించుట కఠినము. ఏదియో యొక యంశమున నందఱియందు మూర్ఖత్వ ముండవచ్చును. సతీమతల్లి వివాహమైన పిమ్మట భర్తను విడనాడుట తలపనే తలపదు.

ఇట్లే కన్యకు 14 సంవత్సరములు నిండవలయునను విషయమును ధర్మనిరుద్ధమే

"అష్టవర్షా భవేద్గౌరీ" “త్రింశద్వర్షో వహేత్కన్యాం హృద్యాం
ద్వాదశవర్షికాం త్య్రష్టవరో౽ష్టవరాం వా ధర్మే సీదతి సత్వరః.”
                                       (మను. 9-94)

ఇత్యాది వచనములు ప్రమాణభూతములు.

"ఉపోపమే పరామృశ మా మే దభ్రాణి మన్యథాః సర్వాహమస్మి
రోమశా గాంధారీణా మివావికా"
                                        (ఋ. 1-126-7)

ఈ మంత్రమువలన 'యౌవన మంకురింపని కన్యను బెండ్లాడి సంభోగార్థము ప్రతీక్ష సేయవలయును' అని వ్యక్త మగుచున్నది.

"అన్యామిచ్ఛ పితృషదం వ్యక్తాం స తే భాగో జనుషా తస్య విద్ధి ”
                                         (ఋ. 10-85-21]
                                         

ఈ మంత్ర మందలి 'వ్యక్తామ్' అను పదమునకు సాయణులు భాష్యము వ్రాయుచున్నారు.

"వ్యక్తామనూఢేనేతి పరిస్ఫుటాం విగతాంజనాం వా
  స్తనోద్గమాది రాహిత్యేన అప్రౌఢా మిత్యర్థః"

దీనినిబట్టి యప్రౌఢయగు కన్యకు బెండ్లిసేయుటే వేద సమ్మతము,