పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

హిందూకోడ్ బిల్ సమీక్ష

"ప్రదానం ప్రాగృతోః "
                     (గౌ. ధ. సూ. 18-22

ఇందు గూడ కన్యకు రజస్వల కాక పూర్వమే పెండ్లి సేయవలయునని చెప్పబడినది.

"న్యూనాద్ధి ప్రజా అసృజత"
                  (తై. సం. 6-1-87)

దీనిని బట్టి కూడ తక్కువ ప్రాయమున పెండ్లి చేయ వలెనని సూచింపబడు చున్నది. కౌటిల్యులు పండ్రెండవ యేట స్త్రీ వ్యవహారయోగ్యరాలని చెప్పుచున్నారు.

"షోడశవర్షే పుమాన్ ద్వాదశవర్షే స్త్రీ ప్రాప్తవ్యవహారా భవతి"
                                      (భర్మ్యప్రకరణే)

రజోధర్మము జరుగగనే వికృతి కలుగనారంభించును . భర్త నిశ్చయింపబడిన మీదట నావికారము చెందిన మనస్సు లోని ప్రేమ యా భర్తయందు గేంద్రీభూతము రాజొచ్చును. భర్త నిశ్చితుడు కానిచో స్త్రీ మానస మిటు, నటు బరువు లెత్తుటయు, క్షేత్ర మపవిత్రమగుటయు సంభవించును. మనస్సు చెదిరిన సంతానముకూడ తదనుకూలముగనే యుం కును. అమెరికాలో నొక యూరోపీయ మహాశయునకు, యూరోపీయ వనితకు నల్లని నీగ్రోజాతి బాలుడు కలిగినాడని ప్రసిద్ధి. డాక్టరులు పరిశోధన చేసి నీగ్రోజాతివాని చిత్రపట మును చింతన చేసినంత మాత్రమున నల్లజాతి సంతతి కలిగిన దని చెప్పినారు. కనుక శుద్ధనంతానార్థమై రజస్వల కాక పూర్వమే పెండ్లి సేయుట చాల మంచిది. గర్భాధానము 14 వత్సరములు గడచిన తరువాతనే చేయవచ్చును..