పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

93

వాస్తవమున వివాహ మొక సంస్కారము. పురుషునకు ఉపనయన సంస్కారము జరిగినట్లు కన్యకకు వివాహ సంస్కారము జరుగును.

"వైవాహికో విధిః స్త్రీణామౌపనాయనికః స్మృతః"
                               (మను. 2-67,68)

కనుక ఉపనయనకాలమే కన్యకు వివాహకాలము. పతి సేవ, గురుసేవ, శ్వశురకులవాసము, గురుకులవాసము నాపె కార్యములు, గర్భాధానాదులు వేఱు, 14 లేక 16 ఏండ్ల కాలము గర్భాధానాదుల కనువయినది. 8 మొదలు 12 వత్స రముల వఱకు వివాహమునకు సముచిత సమయము. సంస్కారకాల మతిక్రమించినచో పురుషు డెట్లుగ ప్రాయ శ్చిత్తము జేసుకొనవలయునో , అట్లే రజస్వలయైన కన్యకు ప్రాయశ్చిత్తానంతరమే వివాహము విధించబడినది.

మాతాచైవ పితా చైవ జ్యేష్టభ్రాతా తథైవ చ
త్రయస్తే నరకం యాన్తి దృష్ట్వా కన్యాం రజస్వలామ్ |
                              (సంవర్త 1.67)

పితుర్దృహే చ యా కన్యా రజః పశ్యత్యసంస్కృతా
సా కన్యా వృషలీ జ్ఞేయా తత్పతిర్వృషలీపతిః
                              (హారీత)
                              
భ్రూణహత్యా పితుస్తస్యాః సా కన్యా వృషలీ స్మృతా
యస్తాం సముద్వహేత్కన్యాం బ్రాహ్మణో జ్ఞానదుర్బలః
అశ్రద్ధేయం హ్యపాంక్తేయం తం విద్యాద్వృషలీ పతిమ్
                                     (దేవల)

అత్రి, కశ్యపుడు, భోధాయనుడు, విష్ణువు, యముడు మున్నగు వారందఱి మతము నిదియే. 'రజోదర్శనముతోడనే