పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

హిందూకోడ్ బిల్ సమీక్ష

తండ్రియందు స్వామిత్వ ముండదు.' అని మనువు కూడ సమ్మతించుచున్నాడు.

"సహి స్వామ్యాదతిక్రామే దృతూనాం ప్రతిరోధనాత్ " [మను]

"కన్యామృతుమతీం శుద్ధాం కృత్వా విష్కృతిమాత్మనః
 శుద్ధిం చ కారయిత్వా తాముద్వహేదానృశంస్యధీః"

ఇత్యాది వచనముల ద్వారా ఆశ్వలాయనుడు రజ స్వలా వివాహమునకు బ్రాయశ్చిత్తమును జెప్పినాడు. (నిర్ణయ సింధు) నగ్నికను అనగా రజన్సు నెఱుగని కన్యను ఏ గుణవంతుడగు బ్రహ్మచారికో యిచ్చి పెండ్లి చేయవల యుసని బోధాయనుడు చెప్పినాడు. గుణవంతుడు దొరుకని యెడల గుణహీనునికైన యిచ్చి పెండ్లి చేయవలసినదే. కాని రజస్వలను మాత్రము కానీయకూడదు.

" దద్యాద్గుణవతే కన్యాం నగ్నికాం బ్రహ్మచారిణే
  అధవా గుణహీనాయ నోపరున్ధ్యాద్రజస్వలామ్ " [4.12]
 

గౌతమ మతానుసారముగ కూడ రజస్వల కాక పూర్వము కన్యాదానము చేయనివాడు దోషి యగును. "అప్రయచ్చన్ దోషీ" - మన్వాది మహర్షులందఱి యభి మతము నిదియే.

"త్రింశద్వర్షో వహేత్కన్యాం హృద్యం ద్వాదశవర్షికామ్,
 త్య్రష్టవర్షోష్ట వర్షాం నా ధర్మే సీదతి సత్వరః॥”

ఈ మనువచనము కూడ కన్యకు 8 మొదలు 12 ఏండ్ల లోవుననే వివాహము విధించుచున్నది. కన్య రజస్వలయైన.