పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

95

తోడనే తండ్రియందు స్వామిత్వము తప్పిపోవును. అప్పుడా కన్యయే తన యిచ్చవచ్చిన వరుని వరించవచ్చును. ఆస్థితి యందు శుల్కముకూడ నీయనక్కఱలేదని చెప్పబడినది.

“పిత్రే న దద్యాచ్ఛుల్కంతు కన్యామృతుమతీం హరన్ |
సహి స్వామ్యాదతిక్రా మేదృతూనాం ప్రతిరోధనాత్ II "
                                  (మను. 9-93)

'తల్లి, తండ్రి, పెద్ద అన్నగారు అవివాహితయగు కన్యను రజస్వల యగువఱకు నుంచిన నరకమును బొందుదురు' అని సంవర్తులుకూడ జెప్పుచున్నారు.

“మాతా చైవ పితా చైవ జ్యేష్ఠ భ్రాతా తథైవచ
త్రయస్తే నరకం యాన్తి దృష్ట్వా కన్యాం రజస్వలామ్|"

హారీతులుకూడ ఇదియే చెప్పుచున్నారు.

“పితుర్గృహే చ యాకన్యారజః పశ్యత్యసంస్కృతాః
సా కన్యా వృషలీ జ్ఞేయా తత్పతి ర్వృషలీపతిః "

రజస్వలయైన కన్యయొక్క తల్లి, తండ్రి, ఆమెను బెండ్లాడు భర్త ముగ్గురును దోషమును బొందుదురు.

"భ్రూణహత్యాపితుస్తస్యాః సా కన్యా వృషలీస్మృతాః
యస్తాం సముద్వహేత్కన్యాం బ్రాహ్మణోజ్ఞాన దుర్భలః ॥
అశ్రాద్ధేయం హ్యపాంక్తేయం తం విద్యాద్వృషలీపతిమ్"

దేవల, అత్రి, కశ్యపుల యభిప్రాయములు కూడ నివియే (ధ. నూ. 18-23)