పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

హిందూకోడ్ బిల్ సమీక్ష

ఇట్లే హిందూకోడుకు చెందిన వివాహమునకు వర్ణ వ్యవస్థతో నిమిత్తము లేదనినారు. ఏ జాతి పిల్లవాడైన యేజాతి పిల్లనైన బెండ్లాడవచ్చును. కొందఱు జనుల యభిప్రాయమేమనగా జన్మమూలకమగు జాతివ్యవస్థయే బాగు లేదట. డాక్టరు అంబేద్కరు ప్రభృతులు స్పష్టముగా జాతి పంక్తి భేదమే ఉంచదలచుకొన లేదు. కొందఱు జనులు కర్మ చేత వర్ణవ్యవస్థ చేయుదమని తలచుచున్నారు. ఆవిషయము ననేకమారులు ఖండించుట కూడ జరిగిపోయినది. శాస్త్రము లందు బ్రాహ్మణాది జాతుల నుద్దేశించి కర్మములు విధించ బడినవి. కర్మల నుద్దేశించి జాతులు విధించబడలేదు. తల్లి, సోదరి మొదలగువారిని ఉద్దేశించి వారి కర్తవ్యములు విధించ బడును. కాని కర్మలనుద్దేశించి మాతృత్వాదులు విధించ బడవు. అనగా’ ‘మా’తా ఏవంకుర్యాత్, పత్నీ ఏవంకుర్యాత్ ' అని విధాన మీవిధముగనే యుండును. కాని 'యా ఏవం కుర్యాత్సామాతా, యా ఏవం కుర్యాత్సా భగినీ' అని యిట్టి విధాన ముండదు. ఇట్లే యనినచో పత్నీకృత్యమును చేసిన కారణము చేత సోదరియు, పుత్రికయుగూడ పత్నులే యగు దురా. ఇది శాస్త్రసమ్మతము కాదు. ఇట్లే 'బ్రాహ్మణః కుర్యాత్ అని విధానముండును. కాని 'య ఏవం కుర్యాత్స బ్రాహ్మణః' అని విధాన ముండదు. కనుక బ్రాహ్మణకర్మ చేసినంత మాత్రమున నెవ్వడు బ్రాహ్మణుడు కాజాలడు. కర్మచేతనే వర్ణవ్యవస్థ యందురా ? అందఱు దినదినము అనేక మార్లు బ్రాహ్మణులుగను, అనేకమారులు శూద్రులుగను