పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

97

మారవచ్చును. ఇక వ్యవస్థ యెట్లు నిలుచును? ఒక బ్రాహ్మణుడు కర్మచేత శూద్రుడు కావచ్చును. అతని భార్య బ్రాహ్మణిగనే యుండవచ్చును. ఆస్థితిలో నాతడామెకు విడాకులైనా ఈయవలెను లేదా వారిరువుఱకు గలిగిన సంతతి చండాల సంతతి యగును. కర్మణా వర్ణవ్యవస్థ చేయ బోవువారు దీనికేమి సమాధాన మిత్తుర? ఉపనయనాది సంస్కారముల నెట్లు చేతురు? బాలకుని కర్మాదులను నిర్ణయించుటే కఠినమైపోవు సన్నమాట. పైగా బ్రాహ్మణునకు శర్మాన్త నామ సంస్కారము యెనిమిదేండ్ల ప్రాయమున వసన్తఋతువునం దుపనయనసంస్కారము నెట్లు పొసగును? సంస్కార, అధ్యయన కర్మాదులను బట్టి జాతి నిర్ణయించ బడిన జాతి నిర్ణయమునుబట్టి సంస్కారాదులు జరుగును. ఇచ్చట నన్యోనాశ్రయదోషము బాగుగ స్ఫుటమగు చున్నది.

"బ్రాహ్మణోఒస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృతః,
 ఊరూత దస్యయద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో ఆజాయత"

ఇత్యాదుల వలస బ్రాహ్మణాదుల పుట్టుక స్పష్టీకరింపబడి యున్నది. "జన్మనా బ్రాహ్మణోజ్ఞేయః" ఇది కూడ స్పష్టమే.

"అజ్యేష్ఠాసో అకనిష్టాన ఏతే సంభ్రాతరో నాపృధుః సౌభగాయ
 సమానపయసశ్చాత్ర మరుతో రుక్మవక్షసః

ఈ మంత్రము మరుత్తుల నుద్దేశించి చెప్పబడినది, వారు 49 మ్మండుగురు. అందఱు సమవయస్కులు. వీరిలో