పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

హిందూకోడ్ బిల్ సమీక్ష

జ్యేష్ఠత్వ, కనిష్ఠత్వము లూహింపబడవు. వాస్తవమందు శబ్దము జ్ఞప్తికి దెచ్చునది యగునుగాని కారకము కాజాలదు. " న హి శబ్దః శతమపి ఘటం పటయితుమీష్టే"- నూరు శబ్దము లయినను ఘటమును పటముగ మార్చజాలవు. వయస్సు చేతను గుణముచేతను వాస్తవిక జ్యేష్ఠత్వ, కనిష్ఠ త్వములున్నచో నిరాకరించు టసంభవము.

" శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్ " స్పష్టముగ శూద్రునకు బ్రాహ్మణత్వము, బ్రాహ్మణునకు శూద్రత్వము వచ్చునని చెప్పబడినది ఈ వాక్యము కొందఱకు ఊతగా నున్నది. ఇదియు సమంజసము కాదు. ఏలయన " సత్మర్మ చేసిన శూద్రుడు జన్మాంతర మందు బ్రాహ్మణుడగుమ్మ మఱియు దుష్కర్మ జేసిన బ్రాహ్మణుడు జన్మాంతరమందు శూద్రుడగును" అని యిదియే యందలి భావము. కుక్క, పంది మొదలగునవి జన్మాంతరమున గాని వేఱు యోనిని బొందవు. అట్లే బ్రాహ్మణాదులును జన్మాంతరమున గాని వేఱు యోనిని బొంద జలరు. వేదములు శ్వ, శూకరాది యోనులతో సమానము గనే బ్రాహ్మణాది యోనులను వేరు వేరుగ గ్రహించినవి.

" తద్య ఇహ రమణియచరణా అభ్యాశోహయత్త
  రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణయోని వా
  క్షత్రియ యోనిం వా వైశ్వయోనిం వా
  ఆథ య ఇహ కపూయ చరణా అధ్యాశోయత్తే