పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

హిందూకోడ్ బిల్ సమీక్ష

శాస్త్రములను దిరస్కరింప సాహసించినవార లొక ప్రభుత్వ మేర్పరచిన హిందూకోడు మున్నగు శాసనములను దిరస్క రించుట కెంతమాత్రము జంకు గొనరు. క్రమక్రమముగ వారిలో విశ్వాసభావ మంతరించి పునర్వివాహము జేసుకొన వచ్చునను ఆశకొలది మహమ్మదీయ మతమును స్వీకరింప నారంభింతుడు, అప్పుడు హిందూధర్మ రక్షణ విషయము గగన కుసుమమై పోవును.

డాక్టరు అంబేద్కరు మహాశయులు మహాశయులు సెలవిచ్చిన విషయ మేమనగా - " హిందువుడు తన యింట 'వధూవరు లిరువురు నొకే వర్ణమునకు, నొకే జాతికి, నొకే యువజాతికి జెందిన వారయి యుండు టావశ్యకమను' విషయ మాచారముగా వచ్చుచున్నచో, దానిని బట్టి యాతడట్లే చేయవచ్చునట. కాని దేశహితవాది యెవండైన హిందూవర్ణములందు, జాతులందు, నుపజాతులందు విశ్వాసము లేనికారణమున నేబయటి పిల్లనైన బెండ్లాడ నెంచిన నాతడు నట్లు చేయవచ్చునట. రూఢివాదులు (ఆచారముగవచ్చు విషయముల నాదరించువారందఱు) తమతమ ధర్మానుసార మెట్లు తలచిననట్లు చేసుకొనవచ్చునట. ఒక ధర్మము ననుసరింపనెంచని దేశహితవాదు లెవ్వఱైన దమ యాలోచనమును, దమ యంతఃకరణమును అనుసరించి నడచుకొనుటకు స్వతంత్రులట."దీనిని బట్టి జాతిమతభేదానుసారము జరిగిన పెండ్లి ధార్మికవివాహమనియు, జాతిమతభేదములతోడ నిమిత్తము లేకుండ జరిగిన వివాహము సివిలుమేరేజి, లేక రిజిస్ట్రిమేరేజి యనియు స్పష్ట