పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

83

సారముగ నిరువురి వివాహములందు, బాధ్యతలందు నధిక భేదమున్నది. వ్యావహారికముగ వంశరక్షణనిమిత్తమై భార్యయే భర్తను పునర్వివాహము జేసుకోన బ్రోత్సహిం చును. కాని కోడుబిల్లును బట్టి యట్లు జరుగజాలదు. పునర్వివాహనిమిత్తముగ మొదటి భార్యకు విడాకులిప్పించి తీర వలసినదే యట! ఆహా! ఏమి ధర్మము ! భార్య యిష్టపడి నప్పుడు కూడ వంశరక్షణనిమిత్తముగ బురుషుడు పునర్వి వాహము జేసుకొన గూడదట!

మహమ్మదీయులలో బహువివాహవిధానము యుక్తమే. కాని హిందువులలో నీహిందూకోడుమూలమున శాస్త్రవిశ్వాసము, ధర్మవిశ్వాసము సంతరించియే పోవును. ఇక నాదంపతు లిరువురు మహమ్మదీయులలో గలసి తమ మనోరథము నీడేర్చుకొందురు. అట్టి స్థితిలో హిందూకోడు ధర్మము నేమి రక్షించును? పైగా మహమ్మదీయులలో బహువివాహవిధానమును నిరోధించనంతవరకు పైవిధానమును నిర్మించనే కూడదు. అట్లు నిర్మించిన భారతీయసమాజ మందు తప్పక క్రొత్త పాకిస్తానుకు బునాది యేర్పడును. హిందువుడు తన జీవితమం దొక్క పెండ్లి చేసుకొని నలుగురు బిడ్డలను గనిన, మహమ్మదీయుడు నాలుగు పెండ్లిండ్లు చేసు కొని పదహారుగురు బిడ్డలను గనగలడు, ఈకారణముచేత. హిందువుల సంఖ్యతగ్గును. మహమ్మదీయుల సంఖ్య పెరుగును. మఱల వారు పాకిస్తానును గోరనారంభింతురు, హిందూకోడు కారణముగ మను, యాజ్ఞవల్క్యాది మహర్షులను, వేదాది