పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అట్టివారిలో శ్రీ ఈదర వేంకటరావు వంతులుగా రొకరు. శ్రీవంతులుగారు ధనవంతులైనందుకు సార్లకముగా ఎన్నూ దానములు చేసియున్నారు. వీరి ఔదార్యము లోక ములో నలుమూలల గంధవహమువలె అమోఘ యశః పరిమళముతో వ్యాపించుచున్నది. శ్రీ కరపాత్రీజీవారి సత్సం కల్పఫలమైన ధర్మప్రతిష్టాపనకు మూలసంస్థ యగు రామ రాజ్యపరిషత్తు శ్రీ ఈదర వేంకటరావు పంతులుగారి మహారధి త్వమున మనొ ధపార మధిగమింపనున్నది

శ్రీ కరపత్రీజీ స్వామివారిచే సువిపులముగ చర్చింపబడి గ్రంథరూపమున ప్రకటింపబడిన 'హిందూకోడ్ బిల్ సమీక్ష' ఆంధ్రలోకములో నైల్లెడ పుష్కల ప్రచారము గావించుటకు శ్రీ స్వామివారి నారాయణస్మరణానుగ్రహ పూర్వకమైన అనుమతి అయినది. అందులకు రామరాజ్యపరిషద్ధురంధరు లగు శ్రీ ఈదర వేంకటరావు పంతులుగారు తమ సహజ చార్యమునకు, ధర్మనిరతికి నిదర్శనముగా అన్ని విధముల చేయూతనిచ్చి తెలుగున ఈ "హిందూకోడ్ బిల్ సమీక్ష" పుస్తకరూపమున వెలువడుటకు మా సాధన గ్రంథమండలికి ఎంతయు సాయమొనరించిరి. ధర్మదూత యగు శ్రీ ఈదర వెంకట్రావు పంతులు గారికి ధర్మదేవత యగు శ్రీరామచంద్ర ప్రభువు ఇతోధిక ధర్మాభిరతిని, విభవములను, వంశాభివృద్ధిగ ననగునుగాక !

తెనాలి ఖర శ్రావణము

ఇట్లు

బులుసు సూర్యప్రకాశశాస్త్రి,

సంపాదకుడు

సాధన గ్రంథమండలి.