పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ హరిః

హిందూకోడ్ బిల్ సమీక్ష

సిం హా వ లో క న ము

సనాతనవిధానము

హిందువులు తమ విధానము సనాతనమైనదని విశ్వసింతురు. వారికొఱకై నవీనవిధానముల యక్కఱయేమియును లేదు. ఈజగత్తు జడపరమాణువులవలనను, విద్యుత్కణముల వలనను సృజింపబడినది కాదు. కేవల జడ ప్రకృతివలన నిర్మింపబడ లేదు. రైలుబండి, తంతి, రేడియో, టాంకు, ఫిరంగు, యంత్రబద్ధమగు తుపాకి, వాయుయానము, యాటం బాంబు మున్నగువాని నిర్మాణమునకు చేతనమనుజుని విశేష బుద్ధిబలము కారణమని మనమంగీకరించుచున్నాము. అట్టియెడ నాకాశము, వాయువు, సూర్య చంద్ర నక్షత్ర సముదాయము పర్వత సముద్రాదులు. శుక పిక హంస మయూరాది పక్షినివహము, వన లతా పుష్పగుచ్ఛ ఫలాదికము మొదలగువాని తోడ విలసిల్లు నీనమస్త భూవలయము, మనుష్యుడు, వాని మస్తిష్క బుద్ధి శరీరేంద్రియాదికము మొదలుగా గల వివిధ విచిత్రతాభూయిష్ఠంబగు విశాల ప్రపంచమును రచించునాతడు కూడ యెవ్వడో సర్వజ్ఞచేతనుఁ డవశ్యముగ నుండితీరవలయును గదా ! చేతను డెవండైనను బుద్ధిపూర్వకముగనే కార్య