పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

హిందూకోడ్ బిల్ సమీక్ష

నిర్మాణము జేసుకొనును. కుమ్మరిని జూడుడు! అతఁడు మున్ముందు దండచక్రాటకమును సంపాదించుకొని జ్ఞానపూర్వ కముగనే కుంభనిర్మాణము చేయుచుండును. అట్లే యీశ్వరుడు కూడ సర్వజ్ఞానమును మున్ముందు సమకూర్చుకొనియే సమస్త ప్రపంచమును సృజించుచున్నాఁడు. అతని సర్వజ్ఞానమందు సూక్ష్మశబ్దానువేధము కలదను విషయము వఱకును సమ్మతము. "న సో౽స్తి ప్రత్యయో లోకేయః శబ్దానుగమాదృతే"(వాక్పదీయే) అనగా పరిచిత భాష యొక్క సూక్ష్మశబ్దములు చేరని ప్రత్యయము. జ్ఞానము సంకల్పము, విచారము వేఱొకటి లేదు. ఈ దృష్టిచేత యీశ్వరసృష్టికి కారణభూతమగు విజ్ఞాన మందుగూడ ఒక కొంత సూక్ష్మశబ్దానుభేదము తప్పక నుండి యుండును. ఆశబ్దములే వేదములు, ఆవేదములే యాభగ వంతుని విధానములు.

ప్రపంచమందు గ్రీకు, లాటిను, జైందు, సంస్కృతము నాదిగాగల భాషలే యత్యంత ప్రాచీనభాషలు. ఈభాషలు పరస్పరమందు అప్పచెల్లెండ్ర వంటివనియు, వీటి కొక మాతృ భాష తప్పక నుండియుండు ననియు, చెప్పబడుచున్నది. కాని యాభాష లభ్యము కాదు. ఒకానొక నాడీభాషను మాటలాడు జనులందఱు నొక్కచోట నుండియుందురనియు, వారందఱు నొకే భాషను మాటలాడువా రనియు, వారి యాభాష యెట్టిదో తెలియజాల దనియు జను లాభాషలయందలి విలక్షణ సామ్యమును జూచి యూహించుచున్నారు.దేశవిషయమున గూడ మతభేదమున్నది. పశ్చిమోత్తరఆసియా,