పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూకోడ్ బిల్ సమీక్ష

3

ఉత్తరధ్రువము ఈ దేశములలో నా భాష వాడబడియుండునని యూహింపబడు చున్నది. అచ్చటి జనసంఘ మొకదాని కొకటి దూరమైనకొలది వారిలో భేదము బయల్వేెవెడల నారం భించెను. కాని కొంత యోరిమి వహించి విచారణ చేయగా మనమిపు డంతరించి పోయియుండు ననుకొన్న యాభాష సంస్కృతభాషయే యని వ్యక్తమగును. ఇది యన్య భాషలకు సోదరి యని చెప్పుటకంటే మాతయని చెప్పుటయేయుచితము. ఈ భాషయొక్క విశాల ప్రకృతి, ప్రత్యయములు, నుపసర్గలు, అక్షయశబ్దకోశము, నిరుపమాన వ్యాకరణము, సాహిత్యము అన్నియు బ్రపంచమునకు నిధులు. దీనిశక్తి నిస్సీమము, దీనికి కూడ పూర్వమం దొకభాష కలదనుటకు ప్రమాణ మేమియు గన్పడుట లేదు. నేటి చరిత్రకారులు కూడ ఋగ్వేదము ప్రపంచమం దత్యంత ప్రాచీనగ్రంథమని యంగీకరించు చున్నారు. అది 5 వేల సంవత్సరములకు పూర్వమందలిదని యూహింపబడుచున్నది. మోహింజోదరో యొక్కయు, హరప్ప యొక్కయు బరిశీలన ఫలముగా లభించిన వస్తువులను బట్టి జనులావస్తువుల కాలమునాటిసభ్యత సుమారు పదిహేను వేల సంవత్సరములకు పూర్వముండెననికూడ యూహింపదొడగిరి. అచ్చటి శిల్పములను, చిత్రముల రంగులను, పాత్రలను,కుండ ములను, యజ్ఞపాత్రలను, అన్య వస్తువులను బట్టి యవి వైదిక కాలీనసభ్యతకు చెందినవని తెలియుచున్నది. కొందఱవి సుమేరియను సభ్యతకు చెందినవని భావింతురు. కొందఱా సుమేరియను సభ్యతకూడ వైదిక సభ్యతమీద నాధారిత