పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

హిందూకోడ్ బిల్ సమీక్ష

మైనదని భావింతురు. ఏమయినను, ఆధునిక పాశ్చాత్య సభ్యతమీడ నడచు జనులందఱు ప్రపంచమంతయు 5 వేల సంవత్సరములకు పూర్వము ప్రాదుర్భవించిన దనియు, ప్రాచీన చరిత్రకాలము, నవీన చరిత్రకాలము నందలివేయనియు భావించుచున్నవుడు వైదిక సభ్యత పదిహేను వేల సంవత్సరము లకు బూర్వమందలిదని ఋజువు చేయబడినదంటే యానందించదగిన విషయము కాదు. వాస్తవమం దాధునిక వైజ్ఞానికలోకము లక్షలాది, కోట్లాది యబ్దములకు బూర్వ మందలి దీయావ ద్భూమండలమని భావింపదొడగిరి. “మొదట సూర్యమండల ముండెడిది. దానినుండి యొక ఖండము ఛిన్నమై క్రిందబడి చల్లబడుచు, బడుచుఁ జంద్రమండల మైనది. రెండవ ఖండము విరిగిపడి భూమండల మయినది. అందు యావిరి, మేఘము, వర్షము, వనస్పతి, జంతుగణము. వానరనివహము, మానవసముదాయము , క్రిమిక వికాసమును బొందుచు వచ్చెను. ఇంకను బొందుచు నుండును. వికాస వాదులు చెప్పు నీయు క్తిని బట్టికూడ సూర్యమండల మెట్లు నిర్మింపబడెను? ఎప్పుడు నిర్మింపబడెను? దాని యాయువెంత! యను ప్రశ్నలు ప్రశ్నలవలెనే యుండిపోవు చున్నవి. . నవీన వికాస వాదు లివుడు ప్రకృతిని గుఱించికూడ కల్పన జేయగలిగిరి. కాని వైదికులది వారికంటెను చాల పూర్వమునాటిదని నిర్ణయింతురు. వారి సిద్ధాంతమును బట్టి ప్రతికార్య నిర్మాణమందును బ్రకాశము, నాందోళనము,