పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మోరక్షతు

ఉల్లంఘ్య సిద్ధో స్సలీలం సలీలం య శ్మోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలి రాంజనేయమ్.

"రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు రూపొందిన ధర్మము. లోకములో ధర్మప్రతిష్ఠాపనము జేయుటకే శ్రీమహావిష్ణువు, శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినాడు. ఆనాడు దస్యువుల కధిపతియైన రావణాసురుడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుని ధర్మరీతిరూపిణి యగు ధర్మపత్నిని, సీతాదేవిని అపహరించి, లోకముల కుపద్రవములను గొనివచ్చినాడు. రుద్రాంశమున ఆంజనేయుడు లోకములో అవతరించి, శ్రీరామచంద్రుని నమ్మిన దూతయై, సీతజాడలు ప్రభువున కెఱిగించి, రావణవధోద్యోగమున శ్రీరామచంద్రునకు చేదోడుగానిలిచి, శ్రీరామచంద్రుని పరమాశయసిద్ధికి మూలకంద మైనాడు.

ఈనాడు మరల లోకములో ధర్మము తారుమారు అగు గతి పట్టినది. దానిని మరల సక్రమముగ నుద్ధరింపవలసిన ఆవశ్యకత యేర్పడినది. అందుకు రామరాజ్య పరిషన్ముఖమున శ్రీ ౧0౦౮ శ్రీకరపత్రీజీ స్వామివారు నడుముకట్టినారు. శ్రీస్వామివారి ఆదేశము ననుసరించి, ఉత్సాహపూరితులు. సమర్థులు అగు పలువురు మహనీయులు, రామదూతలుగా శ్రీస్వామివారి కార్యక్రమమున సన్నద్ధులై నిలిచి యున్నారు.