పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీహరిః

పూజ్యశ్రీ ౧౦౦౮ స్వామి శ్రీ కరపాత్రీజీ మహారాజువారి

ఆశీస్సులు

నారాయణస్మరణము

హిందూకోడ్ బిల్ దేశములోని సమస్త ప్రాంతముల హిందూమతము మీద హస్తాక్షేపము చేయునదై యున్నది. కావున హిందువు లందఱును దానియొక్క ఘాతకప్రభా వమునుగూర్చి బాగుగా తెలిసికొనుట అత్యావశ్యకమై యున్నది. భారతదేశములో వాస్తవిక బహుమతము (Majority) ధార్మిక ఆస్తిక హిందువులదే యైనను దానిలో ప్రచారలోప మగుటచే జాగృతి చాల తక్కువగా నున్నది. ఆకారణమున ప్రభుత్వము మతముమీద సవారి చేయుట కవకాశము కలుగుచున్నది. హిందూకోడ్ బిల్ ప్రమాణము విషయములో శ్రీ బులుసు ఉదయభాస్కరముగారు తెలుగున ననువాదము కావించిరి. దీని మూలమున తెలుగు మాట లాడువా రందఱు ఆబిల్లుయొక్క సమస్త ఘాతుకములను బాగుగా తెలిసికొని తమ కర్తవ్యమును నిర్ధారించుకొన గలుగుదురు. వస్తుతః ఇట్టి పుస్తకముల యనువాదము భారత దేశములోని సమస్త భాషలలో నవసరమగుచున్నది. భాస్క రముగా రొక ప్రాంతములోని లోపమును బూర్తిగావించినారు.

మకాం : బొంబాయి
5-8-1951

(సం.) కరపాత్రీ స్వామి