పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూకోడ్ బిల్ సమీక్ష

వివాహము

శాస్త్రీయ వివాహమునకు, కోడుప్రకారము క్రింది షరతులను బూర్తిసేయు టావశ్యకమని చెప్పబడినది:- (1) వివాహసమయమున నిరుపక్షములందు నేయొకరో భర్త గాని, భార్యగాని యుండకూడదు. (2) వివాహ సమయమున నెవ్వరును మూర్ఖులుగాని, పిచ్చివారుకాని, అయియుండ కూడదు. (3) వరునకు 18 ఏండ్లును, వధువునకు 14 ఏండ్లును వయస్సు పూర్తియై యుండవలయును. (4) రెండు పక్షములవారు పరస్పర నిషిద్దమైన సంబంధము కలవారు కాకూడదు. (5) రెండు పక్షములు పరస్పర సపిండ పక్షములు కాకూడదు. మఱియు నిరుపక్షములందు శాస్త్రీయ వివాహము జరుగుట యుక్తమే యని తెలుపు నాచారము. (6)16 ఏండ్లు వయస్సు నిండని వధువు విషయమున నామె సంరక్షకుని యనుమతి బడయు టావశ్యకము. మాతృకులమందు 8 తరములు. పితృకులమందు 5 తరములు సపిండములని భావించబడినవి. సోదర సోదరీమణులకు, పినతండ్రి సోదర పుత్రికలకు, పినతల్లి సోదర పుత్రులకు, సోదర సోదరీమణుల సంతతులకు వివాహము నిషేధించబడినది. ఇందు అర్థరక్త సంబంధము, సహోదర రక్తసంబంధము, ధర్మజసంతతి