పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

79

లందు, వ్యాసములందు జర్చించి ప్రచారము చేయవలదు. ప్రచారము ప్రజల నాకార్యమునే జేయ ప్రోత్సహించును. ప్రచారస్వాతంత్య్ర మొక పద్ధతినిబట్టి అంగీకరించనువచ్చును. కాని ధర్మవిశుద్ధములగు శాసనముల నిర్మించి బలవంతముగ బ్రజల మెడకు గట్టిపెట్టు పెంతయు నన్యాయము.

ఢిల్లీలోను, ఇతరస్థానములందు హిందూకోడును నిరోధించుట కైయేన్నేని సభలు జరిగినవి. కోడును సమ్మతింపని వారెవరైన యెదుటకు రావచ్చుననికూడ చెప్పబడినది. కాని యెవ్వఱు నెదుటకు రాలేదు. వేఱువేఱుగా మాత్ర మొకరొక విధముగ మాట్లాడిన వేఱొకఱు వేఱువిధముగ మాట్లా డిరి. కాని యాసమర్థకులు ముఖాముఖిగ మాటలాడుట గాని, లేక తమ యాశయములను వ్యాసములద్వారా ప్రచారము చేయుట గాని చాల మంచిది.

మేమందఱము మాధర్మమును, సంస్కృతిని, సభ్యతను మా లోకప్రియ ప్రభుత్వము కాపాడగలదని యాశించు చున్నాము. మా ప్రభుత్వ మీవిషయమున గంభీరవిచారణ చేయుటకు బదులుగ నధికాభినివేశముతోడ "హిందూకోడు" వంటియనావశ్యక వ్యవస్థలను చేయుచున్నదనగా మేమందఱు మెంతయు చింతింపవలసి వచ్చుచున్నది.