పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

హిందూకోడ్ బిల్ సమీక్ష

పరిస్థితియందున్నది. ఇంతవఱకు స్వతంత్రతా సంగ్రామ విషయములనే యాలోచించుచు వచ్చినది. సైనికుని దృష్టి యం దొక్కశత్రువు నెదుర్కొనుటే ముఖ్యవిషయమై యుండును. ధార్మిక, సాంస్కృతిక విషయములు కేవలము నప్రధానములే కాక మార్గమధ్యమున నభ్యంతరము గలుగ జేసినచో, వారు వాటిని దిరస్కరించ వచ్చును కూడాను. "సైనికునకు గంభీరాలోచన సేయుట కవకాశముండదు. ఆ సమయమున సంస్కృతి యెడను, ధర్మముయెడను సైనికుడు చేసిన యవరాధములను క్షమించవచ్చును. కాని యుద్ధానంతర మట్టిపరిస్థితి యుండదు. స్వాతంత్య్ర సంగ్రామసమయమున నాయకులకు భారతీయధర్మ, సంస్కృతుల విషయమును నాలోచించుట కవకాశము చిక్కెడిదికాదు. వారు వీరావేశమునను, భావావేశమునను అనుచితములగు నాచరణములకు, నాలోచనలకు దావిచ్చినారు. వారు చూపిన త్యాగమును, తపస్సును, వీరత్వము కారణమగుట చేత ప్రజలు వారిలోని దోషములను గమనించలేదు. అదృష్టవశమున నేడు దేశము స్వతంత్రమైనది. ఇక నయ్యావేశమును విడచి, తెలివిలోనికి వచ్చి రాక్షస ప్రవృత్తులను విడనాడి వాస్తవికస్థితిని గుఱించి గంభీరముగ విచారణ జేయవలయును. ధార్మిక, సాంస్కృతిక నియమము లుల్లంఘించబడు చుండగా పెద్ద పెద్ద నాయకు లెవ్వఱును జూచియూరకుండరాదు. ఊరకున్నచో సామాన్యజను లింకను నుల్లంఘింప నారంభింతురు. ఎప్పుడైన నెవండైన న ధర్మకృత్యమును జేసినను దానిని ఉపన్యానము