పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

77

నందఱు తనతో సమానులనుగజేయు బ్రయత్నించుచున్నాడు. సర్ సుల్తాను అహముదు ఏమి , యోగేన్ద్రమండలుడేమి, రావుసాహబేమి? డాక్టరు అంబేద్కరు ఏమి? - వీరెవరికిని వాస్తవముస హిందూధర్మమును దాకుటకైన యర్హతయు, నధికారమును లేదు. హిందువులు రామ, కృష్ణాద్యవతారములను, విశ్వామిత్ర, వశిష్ఠాది ఋషి పుంగవులనుగూడ కేవలధర్మపాలకులుగను, రక్షకులుగను మాత్రమే భావింతురు. పరబ్రహ్మయగు బరమేశ్వరుని గూడ బ్రహ్మదేవుని సృష్టి కర్తయని తలతురు కానీ, వేద నిర్మాతయని మాత్రము తలపరు. కాని యాపరమేశ్వరుడే అంతకు బూర్వమున్న వేదములను బ్రహ్మదేవుని హృదయమందు ప్రకటమొనర్చి నట్లు భావింతురు. ఇట్టి స్థితియందు వేదములను, వేదాధారము లగు నార్షధర్మగ్రంథములను ఆధారముగ జేసుకొని యేర్చరుప బడిన ధర్మములను మార్పు చేయుట కొక స్వేచ్ఛాచారియగు వ్యక్తి కధికార మెటులుండును? నేటి శాసకు లధికారగర్వమున గన్నులు గానక నేమి తలచిన దానిని జేయవచ్చును. కాని యంతమందు వారి యీశాససము లన్నియు తగులపెట్ట బడకను దప్పదు. చేసిన దుష్కృత్యములకు ప్రాయశ్చిత్తము చేయించబడకను దప్పదు.

రాష్ట్రము సర్వవిషయములందును స్థిరమైన యున్నతిని బొందవలయుననిన భౌతికవిషయములతో బాటు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయములను గూడ ఉన్నతిలోనికి దెచ్చు టత్యవసరము. మన రాష్ట్రము నేటివఱకు సంగ్రామ