పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

హిందూకోడ్ బిల్ సమీక్ష

ఎవండైన 'సివిలు మేరేజీ విషయమున కేసు పెట్ట దలచిన యెడల కోర్టులో సర్టిఫికేటు తీసుకొని వివాహ రిజిస్ట్రారు కివ్వవలసి వచ్చును. తీర్పు జరుగనంతవటకు వివా హము పూర్తికావట్లే తలపబడును. ఈవిధముగ జిన్న చిన్న విషయములందు కోర్టు వారికి బాగుగ లాభము కలుగును, వివాహము సంపన్న మగుటకు మిగిలిన విషయము లన్నియు సప్రధానము లగును. వివాహ రిజిస్ట్రారు, ముగ్గురు సాక్షులు మాత్రమే ప్రధానమగుదురు.

తరచుగ నాస్తికుల విషయమున నేవేని ధార్మిక నియమము నేర్పరచుటకే కాక శాస్త్రవ్యవస్థ నేదేని నవలం బించవలసి వచ్చినప్పుడుకూడ నాచరణశీలురగు ధర్మాత్ముల ద్వారా అవలంబించుట జరుగుచున్నది. వ్యవస్థ చేయువాడు రాగ ద్వేషములకు లోనై స్వార్థమును సిద్ధింపనించుకొనినచో నాతడు వ్యవస్థ చేయదగనివాడని భావింపబడు చున్నాడు. కొలది దినములనుండి మాత్రము పరిస్థితి యెట్లు మారిన దనగా నేదేని శాస్త్రవిరుద్ధ విషయము జరుగగనే దానినాధార ముగ జేసుకొని దానికనుకూలమగు వ్యవస్థ చేయబడనారంభిం చినది. అందుల కైకూడ శాస్త్రవచనము అన్వేషింపబడుచునే యుండెడివి. కాని క్రొత్త వ్యవస్థలను, క్రొత్త శాస్త్రములను నిర్మింప బ్రయత్నము చేయబడెడిది కాదు. కాని డాక్టరు అంబేద్కరు వంటి వ్యక్తి, అంత్యజుడయ్యు బ్రాహ్మణ స్త్రీని బెండ్లాడి మహాపాపమునకు బొల్పడిన వ్యక్తి ఇచ్చవచ్చిన రీతిని శాస్త్రమును నిర్మింప సాహసించుచున్నాడు. విశేషముగ