పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

75

వివాహ విషయమున మాత్రము సంరక్షకుల యనుమతి కూడ తీసుకొనుటవసరమని భావించబడినది. విధవా స్త్రీ తన యిచ్చ వచ్చినవానిని బెండ్లాడవచ్చును. నేటి సాధారణస్థితిలోనే రిజ స్ట్రేషను లధికముగ నున్నవి కదా! బిల్లు అమలులోనికి . రాగానే ప్రతివ్యక్తియా లెక్కలేనన్ని వివాహములను, లెక్కలేనన్ని విడాకులచట్టపు టేర్పాట్లను రిజిస్ట్రేషను చేయించుకొనవలసి వచ్చును. గుమాస్తాల యొక్కయు, నాఫీసర్ల యొక్కయు. నావశ్యకత మెండయి ప్రజల ధన మంతయు ననవవసర కార్యక్రమములం దధికముగ ఖర్చయి పోవును. దీనికే 'అవ్యాపారేషు వ్యాపారః' అనిపేరు. ప్రతి వ్యవహారమందు కోర్టుల శరణము తప్పకపోగా, ప్రజలీ లా గ్రంథములను జదువుటకు దగుధనము, సమయము మాత్ర మేల ఖర్చుకాదు ? కాని యొక విషయమేమన, ప్రజలు చాల భాగము చదువురానివారు. రెండవ విషయమేమన వారి చాల సమయము ఉప్పు, మిరపకాయలను సమకూర్చుకొనుట లోనే ఖర్చయిపోవును. ఇక వారికి లాగ్రంథములను జూచు కొనుట కవకాశ మెక్కడ చిక్కును? ఆస్థితిలో ప్లీడర్ల, బారిష్టర్ల కడుపులు బాగుగ నిండునన్న మాట. ఈస్థితిలో గూడ "కేసులను, దావాలను తగ్గించుటకై తోడుబిల్లు అవస రము". అని పలుకుచున్నారంటే అంతకంటే నాశ్చర్య మేమున్నది ? 'కి మాశ్చర్యమతః పరమ్' పైగా నిటువంటి లంచగొండితనపు కాలములో కోర్టులద్వారా న్యాయమును మనమెటు లపేక్షించగలము ?