పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

హిందూకోడ్ బిల్ సమీక్ష

"మతయో యత్ర గచ్ఛన్తి తత్ర గచ్చన్తి వా నరాః
శాస్త్రాణి యత్ర గచ్ఛన్తి తత్ర గచ్ఛన్తి తేనరాః."

ఇచ్చవచ్చినట్లుగ నడచుకొనువారే వానరులు, శాస్త్ర సమ్మతముగ నడచుకొనువారే నరులు. నేటి సభ్యులదృష్టిలో వివాహముకూడ నసభ్యమే కావచ్చును. హోమాదులు సేయుట, మంత్రముల బఠించుట, ప్రదక్షిణములు సేయుట, కన్యాదానము సేయుట లేక గ్రహించుట- ఇది యంతయు నాధునిక దృష్టియం దనభ్యతాలక్షణమే కావచ్చును. శాస్త్రముల ననుగమించువాడే యీయీ విషయములను దెలుసుకొన గలడు. అతని దృష్టికి శాస్త్ర సమ్మతమగు నవివాహము, వివాహము, బహువివాహము మున్నగునవన్నియు సభ్యత్వ చిహ్నములుగనే కన్పట్టును.

హిందూకోడువారు శాస్త్రీయ వివాహమందు ఒక్క సప్తపదియే కాక కన్యాదానము, లాజహోమము కూడ అవసరములేదని చెప్పినారు. అవి లేకున్నను గేవల సప్తపది మాత్రముననే వివాహముచితమని తలపబడునట. ఇది కూడ శాస్త్రముల పేరట శాస్త్రములమీద దాడిచేయుటయే. శాస్త్రీయ వివాహములను రిజిష్టరు చేయించుటవలన నవి యపూర్ణములని సిద్ధమగును. ఇందులకై వ్యయముకూడ నధికమగును, సివిలుమేరేజి యాక్టు ప్రకారము శాస్త్రములను పూర్తిగ ద్వేషించువాడుకూడ శాస్త్రములను విశ్వసించు వానితో సమానముగ భావించబడును. అట్లు భావించనివా డితరశాసనముల ప్రకారము దండనపాత్రుడగును. విధవా