పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

73

నేడు కొందఱు జనులు ధార్మిక, సామాజిక నియమ ముల విషయమున విప్లవమును జెలరేగజేయుట వీరత్వము, గర్వించదగు విషయమునని భావించి 'బహువివాహ ప్రతి షేధము, విధవావివాహ ప్రతిషేధము తమ సభ్యత నంతను మంటగలిపినద'ని పలుకుచున్నాడు. 'ఇదియంతయు వారు స్వకీయ గౌరవముకుమఱచిపోవుటయొక్క దుష్పరిణామమేకాని వేఱొండు కాదు' అని యింతమాత్రమే దానికిసమాధానము


ఏదేని వస్తువు మంచిదా? చెడ్డదా? యను సమస్య ప్రమాణము వలన బరిష్కారమగును. కాని ప్రపంచము వలన గాదు. సభ్యుడన నెవరు? “సభాయాం సాధుస్సభ్యః" ఈ వ్యుత్పత్తిని బట్టి సభయందు సాధువైనవాడు సభ్యుడనబడును.. లోకుల సభ యెటులున్న నట్లే యందలి జనులును సాధువులుగను, మంచివారుగను బరిగణింపబడుదురు. వేశ్యలసభలో వేశ్యయే మంచిదని భావించబడును. కాని యావేశ్యయే పతివ్రతామ తల్లుల సభయందు మంచిదని యెట్లు పరిగణింపబడును ? కోటు, బూటు, హేటులను ధరించి భోజము చేయువారికి, కాలు నేతులు కడుగుకొని, పట్టుబట్ట ధరించి, పవిత్రస్థానమున గూర్చొని భోజనము సేయువా రసభ్యులుగనే దోపవచ్చును. కాని వాస్తవమునకిది సభ్యత కాదు. ప్రామాణికుల సభయే వాస్తవమున ‘సభ' యనబడ దగినది. అందలి ప్రామాణికులే సభ్యులు. శాస్త్రానుసారముగ నడచుకొనువారే సభ్యులు. ఇచ్చవచ్చినట్లుగ నడచుకొనువారు సభ్యులునుకారు, నరులును గారు. వారు కేవలము వానరులే.