పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

హిందూకోడ్ బిల్ సమీక్ష

డధికారి యని పేర్కొనబడియున్నదో దానికి వ్యతిరిక్త విధానమును చేయుటెంతయు నధర్మము. స్త్రీ ధనము నాపత్కాల మందొక్క భర్త తప్ప అన్యు లెవ్వడును ఖర్చు పెట్టరాదు. ఇందుచేతనే ఆమె యధికారముల విషయముల నధికవిచారణ \ చేయబడినది. వివాహితయగు స్త్రీ కంటె, వివాహము కాని కన్యకకును, వివాహమైన వారియందు గూడ నప్రతిష్ఠితా స్త్రీ లకును ప్రథమాధికారము భావింపబడు చున్నది. ' అనేక మంది రోగుల కొకేమందు ' వంటి వ్యవస్థయే అవ్యవస్థ యనబడును. గాని మను, యాజ్ఞవల్క్యాదుల వ్యవస్థలు శాస్త్రీయములు కావున నవ్యవస్థలు కాజాలవు. రోగులందఱకు నొకే చికిత్స నేర్పరచువా డజ్ఞాని యగును.

కాని బుద్ధిమంతుడు కాదు. స్త్రీ పురుషులు ప్రకృతి, యోగ్యతలం దధిక భేద ముస్నది. స్త్రీలలోగల గర్భధారణ, సంతానసాలనాది తత్త్వములు పురుషులలో లేవు. పురుషుని యందుగల కాఠిన్య గుణము స్త్రీయందు లేదు. పురుషుడార్జన సేయును. స్త్రీ ఆయార్జనమును గృహమందు సముచితముగ సుపయోగించును. పురుషునిది బాహ్యక్షేత్రము. స్త్రీది గృహక్షేత్రము. కనుక స్త్రీ సదా పురుషుని నియంత్రణమందే యుండవలయునని విధించబడినది. తండ్రి యాజ్ఞానుసారము. గనూ, పుత్రుని యాజ్ఞానుసారముగమో, భర్తయాజ్ఞాను సారముగమో స్త్రీ తన ధనమును ఖర్చు చేయగలదు. స్త్రీ