పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

67


కోడుబిల్లు వారు చెప్పునదేమనగా, 'యుగయుగమందలి దయా, ప్రేమ, వాత్సల్యములు స్వరూపమును దాల్చినవా ? యన నొప్పు నారీలలామ తన యధికారములను దుర్వినియోగముసేయుననియు, స్వేచ్ఛాచరణకు దారితీయుననియు శంకించుట చాల యన్యాయము. సీతా, సావిత్రుల సంతాన విషయమున నిట్లు శంకించుట ఆ పరమ పతివ్రతల నవమానించుటే' కాని మన మిచట నాలోచించ వలసిన విషయమేమి యనగా, కర్తవ్యనిష్ణా, దయా, ప్రేమ, వాత్సల్యములు రూపము దాల్చినవా యన నుప్పు నారీ లలామ తండ్రి యాస్తిని, విడాకులు చట్టమును ఆపేక్షించునా? ఎంతమాత్రము నపేక్షింపదు. సీతా, సావిత్రి మున్నగు వారిని మూర్ఖులనుగా తలచి సంపత్తును, విడాకుల చట్టమును గోరుకొను స్త్రీ తనను సీతా, సావిత్రి మున్నగువారి సంతాన మని చెప్పుకొనవచ్చునా? వారికిందు ఏమైన గౌరవము కన్పించుచున్నదా ? వారు విడాకుల చట్టమువంటి యవ్యవస్థను గోరుకొనగా, దానిని దుర్వినియోగము చేయకుందు రనుటకు మాత్రము ప్రమాణమేమున్నది?

డాక్టరు అంబేద్కరు మహాశయుడు స్త్రీ సంపత్సమస్య నత్యాశ్చర్యముగ వర్ణించి చెప్పుదురు. కాని శాస్త్ర పరిచయము గల వ్యక్తుల కీవిషయము అత్యంత సుబోధ మగును. స్త్రీ యొక్క వారసత్వపు విధానముల నుల్లఘించి హిందూకోడు ప్రత్యక్షమందు మను, యాజ్ఞవల్క్యదుల వచనములను ద్రోసిపుచ్చినది. శాస్త్రములందే సంపత్తు కెవ్వ