పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్షణమువల్లనే వంశ, గోత్రాదులు నిలుచును. స్త్రీక్షేత్రము పాడగుటతోడనే అన్ని విషయములు పాడగును. కనుకనే స్త్రీలు పురుషులకంటె నూరు రెట్లధికముగ బూజింపబడ దగినవారు, లజ్జా శీలములే స్త్రీలలోని విశేషములు. కావున వారికి పునర్వివాహ మెంతమాత్రము బనికిరాదు.

ఇంతియగాక విడాకుల చట్టమును స్త్రీ యెటులువయో గించుకొనుమో, యటులే పురుషుడు నుపయోగించుకొనును. స్త్రీలు లజ్జాసంకోచములు కలవారు కావున దీనివలన వారికి చాల తక్కువలాభము కలుగును. కాని చపలచిత్తులగు బురుషులే యీచట్టమును దుర్వినియోగముజేసి యధిక లాభమును బొందుదురు. పురుషులు పిల్లలుకల స్త్రీలను, రూపములేని స్త్రీలను, వయస్సు ముదిరిన స్త్రీలను విడచి క్రొత్త క్రొత్త. రంభలను వెదుకనారంభింతురు. రూపవతులగు యువతులే యొకటి రెండు మారులో పునర్వివాహమును జేసుకొనగలరు. కాని మిగిలిన రూపము లేని సాధారణ స్త్రీలు, వయస్సు ముదిరిన స్త్రీలు తమ భర్తలు విడచి పెట్టి వేయుటచే మఱల నెంత ప్రయత్నించినను రెండవ భర్తను బొందలేరు. వారు రక్తాశ్రువులు గార్చుచు జీవితము గడుపవలసివచ్చును. ఏదియో కొలది చవలచిత్తలగు రంభల నిమిత్తమై చాలమంది స్త్రీల జీవితములు ప్రమాదములకు గుఱియగును. వారి కడుపుమంట (ఆకలిబాధ) అధికమైపోవును. వారి మనోభీష్టముల గతి యేమి కావలయునో పాఠకులే యాలోచించి తెలును కొనగలరు.