పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

65


పోవును. అనురాగవశమున సంపాదించుకొనిన వస్తువునందు నిషేధ భావము, దురాచార భావము, అధర్మ భావము నకు గంటుటతోడనే విధాన భావము, సదాచార భావము, ధర్మ భావము బయల్వెడలును, పిమ్మట దానిని మఱలించుట మనకు శక్యము కాదు. "యద్వాక్యతో ధర్మ ఇతీతరస్థితోన మన్యతే తస్య నివారణం జనః" "స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః." తన వద్ద నస్త్రము నుంచుకొనుటొక విష యము. పాపపు బని సేయుట కవకాశ మిచ్చుట వేరు విష యము. అస్త్రము నుంచుకొనుట అవైధము (తప్పు) కాదు. తన కాలు చేతులను మనుజుడు స్వాభావికముగ నరుకుకొన లేదు. కాని క్రొత్త క్రొత్త భర్తల ననుభవించ వచ్చునను దలంపుతోడ బురాతన భర్తలను విడచి పెట్టుచు నుండుటయు గష్టము కాదు. కావున భర్తను విడచిపెట్ట వచ్చు ననుటెంతయు హానికారణము, విడాకులు పుచ్చుకొనకుండగను కూడ కడుపుమంటను చల్లార్చుకొనుటకు విధిప్రయుక్తములు అగు నుపాయము లుండవచ్చును. వేశ్యలు కూడ నేదియో యొక సమయమున కడుపుమంటతో బాధపడువారే కదా ! అట్టి యెడ `కేవలమొక్క విడాకుల చట్టమూలమున మాత్రము కడుపుమంట చల్లారునని యెట్లు చెప్పగలము? సంతోషము లేనపుడు యౌవనపు టభిలాషలు మాత్రమెటు లీడేరును! ఎప్పటికైన సద్గ్రంధ పఠనమువలనను, ఇంద్రియ జయము, పవిత్ర వాతావరణము, భజన ధ్యానాదుల వలసను చిత్తము శాంతిని బొందగలదు. స్త్రీ పురుషుల ప్రకృతులు వేరు. స్త్రీ