పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

హిందూకోడ్ బిల్ సమీక్ష

చున్నది. ఇందుచేత నిరువురి హక్కులలోను భేదమున్నది. ఆడుబిడ్డ హక్కుల విషయమున స్మృతులను ఉదాహరణగా గ్రహించుటవలన తాత్పర్యము తెలియలేదను విషయము సుస్పష్ట మగుచున్నది. ఈవిషయ మీగ్రంథమందే యన్యత్ర విశదముగ విమర్శించబడినది. 'శాననము ద్వారా రూఢి బలీయముకాగల' దని ప్రివీకౌన్సిలు చెప్పిన తీర్మానము బాగుగనే యున్నది. కొని యారూఢి శాస్త్రవిరుద్ధము కాకూడదనియే యందలి భావము. శాస్త్ర సమ్మతమైన రూఢియు, ప్రాచీనులు, శిష్టులు నాచరించుచు వచ్చిన యేదేని వ్యవ స్థయు భ్రాంతిరహితమగును. నేడు కన్యయొక్క చతుర్థాంశమునకు సంబంధించిన హక్కుల విషయమున జనులెట్లు పొరబడుచున్నారో, అట్లే వేర్వేఱు శాస్త్రముల భావములను దెలుసుకొనుట విషయమున గూడ బొరబడ వచ్చును. ఇది యొక యావశ్యకదాన మనియు, దాయము మాత్రము కాదనియు, మూల వచనములను బట్టియే తెలియుచున్నది. ఒక సోదరుడు స్వతంత్రుడగు తన వేఱొక సోదరులకు దన యంశమున గొంత దానము సేయడనియు, సోదరుడు తన యంశమునుండి కొంత భాగమును దన సోదరి పెండ్లి నిమిత్తమై ధర్మము సేయుననియు నీ మొదలుగాగల విషయము లన్యత్ర విశదీకరింపబడినవి. ఇంతియగాక సంపత్తు నశించుట, మనస్సు పాడగుట మొదలుగాగల యనర్థములు జరుగగల వని కూడ స్పష్టీకరింప బడినవి.