పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

71

న గలిగి, రెండవ భాగము నేల రక్షించుకొన లేదు?" అను ప్రశ్నకు తావేలేదు. వస్త్రాభూషణములను, రూపాయలను, రక్షించు కొనలేదు! " అనుప్రశ్నకు తావేలేదు. వస్త్రభూషణములను, రూపాయలను రక్షించుకొనదగు ప్రవృత్తి స్త్రీలలో స్వతస్సిద్ధముగనే యుండును, కాని బాహ్యసంపత్తును సంరక్షించుకొనుట అంత తేలికకాదు. ఎప్పుడైన స్త్రీకి ధనరూప ముగ పెద్దసంపత్తు వచ్చిన దానిని భర్తయో, పుత్రులో సంరక్షింతురు. కేవల పతిపుత్రాదుల సమ్మతిమీద స్త్రీ యా ధనమును వినియోగించును. లేదా శాస్త్రానుసారముగ ధర్మము సేయును. పతి పుత్రాదుల నమ్మతి లేనిదే స్వతంత్రించి యన్యపురుషులతో గలసి సంరక్షణ యేర్పాట్లను జేసుకొనుట, ఇచ్చవచ్చినటు లింట బయట దిరుగుట, ఇచ్చవచ్చిన పురుషులతోడ కలసి మెలసి నడచుకొనుచుండుట, సంపత్తు నిచ్చ వచ్చినటు లువయోగించుటయు నెన్నడు స్త్రీకి విధించబడలేదు.

ఇదేవిధముగ నాడుబిడ్డ హక్కుల విషయమున డాక్టరు అంబేద్కరు ప్రతిపాదించిన యాలోచనలు నిరర్థకములు, శాస్త్రవిరుద్ధములును. తండ్రికి పుత్రుడెంత ప్రియుడో పుత్రికయు నంతయే ప్రియురాలు. అయినను అందొకఱి నాతడు దానము చేయవలసి వచ్చుచున్నది. వేఱొకరి నింట నుంచుకొనవలసి వచ్చుచున్నది. ఒకరు తన వంశగోత్రాదు లను వృద్ధి బొందించి పిండ శ్రాద్ధాదులు చేయగా, వేఱొక రన్యగోత్రములలోనికి బోయి సర్వము చేయవలసి వచ్చు