పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

హిందూకోడ్ బిల్ సమీక్ష

డును, పైగా వేదములందు స్త్రీ యొక్క మనస్సును విశేషించి యాశాస్య మని చెప్పినారు. "స్త్రీణా మాశాస్యం రఘు" "యధేష్టం స్థావరేష్వపీ " అను వాక్యము కూడ ముందు ముందు సందర్భానుసారముగ వ్యాఖ్యానించబడినది. సౌదాయికాది సంపత్తులో గూడ ముఖ్యముగ చరాస్తి మీద స్వతంత్ర మున్నది. స్థిరాస్తి యందుగూడ భరృదత్త స్థిరాస్తి యందు స్వాతంత్య్ర మున్నది. కాని యది విపత్కాలమందు ప్రాణరక్షణకొఱకును కుటుంబ రక్షణకొఱకును క్రయవిక్రయ ములు సేయవీలగును. అయినను పరిపూర్ణస్వాతంత్య్రము నిషేధమే. లేని యుదాహరణము నాధారముగ జేసుకొని వారసత్వపు ఆస్తి యొక్క హక్కులనుగుఱించి ప్రశ్నోత్తర సమాచార మెట్లు పొసగును?

ఒకడొక చిన్నవస్తువును సంపాదించుకొన్నాడనగ, యాతడు పెద్దవస్తువునుకూడ సంపాదించునని మనమెట్లు చెప్పగలము! అతడు చిన్న వస్తువును దుర్వినియోగము చేసి నచో పెద్దవస్తువును దుర్వినియోగము చేయనీయరు. సాధా రణముగా స్త్రీకి ధనరూపమున భూషణములో వస్త్రములో, కొలది రూపాయిలో ఉండును. వారసత్వముగా నిల్లు, భూమి, అధికముగ నగలు వచ్చును. కనుక వీటిని సర్దుబాటు చేసుకొనుట కష్టము. వీటిని దుర్వినియోగము చేసిన హాని కలుగును. కనుక బిల్లును ప్రతిఘటించు వారు చెప్పవలసిన విషయమేమి యనగా "స్త్రీ తన ధనమందలి యొకభాగమును రక్షించుకొ