పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

69

స్వతంత్రించి సంపద నుపయోగింప నారంభించిన తనకు, తన పరివారమునకుకూడ చాల యనర్థము వాటిల్లును. అనేక ప్రకారముల పురుషులతోడ సంపర్కమువలన స్త్రీలహృదయ గతులే మారిపోవును. తన్మూలమున సంపత్తు దుర్వినియోగము సేయబడును. ముందుముందు ఇటువంటి వేలాది చరిత్రలు జరుగగలవు.

ధనమును స్వతంత్రముగా ఖర్చుసేయవచ్చుననుట కుదాహరణముగా జెప్పబడుచున్న విషయమేమి యనగా, 'స్త్రీ తనధనమును స్వతంత్రించి ఖర్చు పెట్టుకొనవచ్చునను విష యమును స్మృతికారులుకూడ నంగీకరించుచునే యున్నారు కదా! అట్టి స్థితిలో విధవాస్త్రీకి వారసత్వరూపముగ లభించిన యాస్తి నామె ఏల వినియోగించుకొనకూడదు? ఆమె కందు సంపూర్ణ స్వతంత్రత యేల యుండరాదు ?' ఇదియు సముచితముకాదు. మొదటి విషయము స్త్రీధనము కొలదిగ నుండును. రెండవ విషయము స్త్రీ యెల్లవేళల బరతంత్రురాలని చెప్పబడినది. 'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అందుచేతనే యామె తన ధనమునుకూడ దుర్వినియోగము సేయ వీలు లేదు. కాని భర్త చనిపోయి, ఈమె సంపత్తుకు యాజమాన్యమును అన్యరక్షకుల యక్కఱలేకయే తన ధనమును తాను ఖర్చుపెట్టుకొనగల స్థితిలో నన్యదురాచారుల సంపర్కమున బడి యీమె సంవత్తును దుర్వినియోగము జేయవచ్చును. సాధారణముగా నందఱి మనస్సుకూడ చంచలముగనే యుం