పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

హిందూకోడ్ బిల్ సమీక్ష

నుంచుకొనడు. అట్లే భర్త చోరుడు, పతితుడు, నన్యాయి యైనచో లేక బునర్వివాహము జేసుకొన్నచో స్త్రీ వైధవ్యము, త్యాగము, తపస్సుతో గూడిన జీవనమును గడుప లేనియెడను, తన మనస్సును నిలువబెట్టుకొన లేనియెడను. బిడ్డలను పెంచుకొనుటకై వ్యభిచారములకు సంసిద్ధురా లగుటకంటె గౌరవపూర్వకముగ బునర్వివాహము జేసుకొను టెంతయు మేలు, విడాకుల చట్టమూలమున నామె కనుకూల వాతావరణము లభించును, పునర్వివాహము వలన కడుపు మంట చల్లారును. యౌవనమందలి యభిలాష లీడేరును. ఈస్థితిలో వివశురాలై యామె సతీత్వమును భంగపరచుకొన నక్కఱ లేదు. భ్రూణహత్యలు, (గర్భస్థ శిశువుల జంపుట) చేయనక్కఱ లేదు. తిరస్కృతురాలై రూపమును అమ్ముకొన నక్కఱయు లేదు. పైవిధముగ విడాకులచట్టమును సమర్థించువారు చెప్పుదురు. కాని పైవిషయములు పైకి మాత్ర మాపాతరమణీయముగనే యున్నవి. కాని కొంత యాలోచించి చూడగా నదికూడ చాలహానిని గలిగించునవి యని తేలగలదు. ప్రపంచమందు పాప, పుణ్యములు సదా జరుగుచునే యుండునను విషయము నిజము.

కాని యెంతవరకు ధర్మాధర్మ భేదము, పాపపుణ్య భేదము, విధినిషేధ భేదము నుండుమో యంతవరకే కొందఱు కాకున్న కొందఱయినను పాప అధర్మ, నిషేధాదులకు దూరముగానుండ బ్రయత్నింతురు. పైభేదభావము లేనపు డనాచార మార్గమునుండి మఱలు టయే దుష్కరమయి